నిన్నటి రోజున విడుదలైన విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో ఈ వీకెండ్ తరువాత ఈమూవీ కలక్షన్స్ చాల ఘోరంగా పడిపోయే ఆస్కారం ఉంది. వాస్తవానికి ఈ మూవీకి దర్శకత్వం వహించింది క్రాంతి మాధవ్ అయినప్పటికీ ఈ మూవీ కథ విషయంలో విజయ్ దేవరకొండ తన ఇష్టానుసారంగా మార్పులు చేయడంతో ఈ మూవీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. 


స్వతహాగా సున్నిత మనస్తత్వంతో ఉండే కాంతి మాధవ్ విజయ్ దేవరకొండ దూకుడు తట్టుకోలేక ఈమూవీ మధ్యలోనే చేతులెత్తేయడంతో విజయ్ తన సహజ సిద్ధమైన అత్యుతాహంతో ఈ మూవీ పై చేసిన విపరీతమైన ప్రయోగాలు వికటించడంతో ఈమూవీకి ఈపరిస్థితి వచ్చింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనితో విజయ్ దేవరకొండ తన స్థాయిని తాను తెలుసుకుని తన ‘అర్జున్ రెడ్డి’ మ్యానియా నుండి బయటకు రాకపోతే రానున్న రోజులలో విజయ్ కు కష్టాలు తప్పవు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 


ఇది ఇలా ఉంటే నిన్న జరిగిన వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కూడ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అన్న విషయాన్ని ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక బయట పెట్టింది. ఆయన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి ఆయన స్వయంగా వ్రాసుకున్న ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పుస్తకంలో రతన్ టాటా పేర్కొన్న ఫెయిల్యూర్ లవ్ స్టోరీని ఈరోజు ప్రచురించింది.


తాను అమెరికాలో ఉన్నప్పుడు తాను ఒక అమ్మాయితో ప్రేమలో పడిన విషయాన్ని వివరిస్తూ అప్పట్లోనే బాగా చదువుకుని అందంగా ఉన్న ఆ అమ్మాయిని ఇష్టపడ్డ విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే 1962 లో తాను తన బామ్మకు ఆరోగ్యం సరిగ్గా లేదనీ ఇండియా వస్తున్నప్పుడు తన ప్రేయసిని కూడ తన వెంట రమ్మని అడిగినప్పుడు ఆమె తన సూచనకు అంగీకరించక పోవడంతో తన బామ్మను ఇష్టపడని వ్యక్తి తనకు ప్రేయసిగా అనవసరం అని భావించి అక్కడితో తన ప్రేమ వ్యవహారాన్ని ముగించుకున్న విషయాన్ని బయట పెడుతూ ‘ప్రేమ’ లో ఫెయిల్ అయిన వారు ఆ బాధను మరిచిపోవడానికి దేవదాసు అవ్వకుండా ‘సేవాదాసులు’ గా తనలా మారవచ్చని నేటి యువతరానికి రతన్ టాటా సందేశం..

మరింత సమాచారం తెలుసుకోండి: