ఎన్టీఆర్‌.. ఆ పేరు తెలుగు సినీ అభిమానుల తారకమంత్రం. తెలుగు వారి ఆత్మగౌరవం. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ వెండితెరకు పరిచయం అయిన యువ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ పేరునే కాదు ఆయన పోలికలను, నటనా చాతుర్యాన్ని కూడా పుణికిపుచ్చుకున్న యంగ్ హీరో ఎన్టీఆర్‌. చిన్న వయసులోనే తాతతో కలిసి బ్రహ్మార్షి విశ్వామిత్ర సినిమాలో నటించిన ఎన్టీఆర్‌ తానేంటో ప్రూవ్‌ చేసుకున్నాడు.

 

తాతకు తగ్గ మనవడని ముందే గుర్తించిన దర్శక నిర్మాతలు తొలిసారిగా ఎన్టీఆర్‌ తారక రాముడిగా తెరమీద చూపించారు. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బాల రామాయణం సినిమాతో లీడ్‌ యాక్టర్‌గా వెండితెరకు పరిచయం అయిన తారక్‌ తొలి సినిమాతోనే తానేంటో ప్రూవ్‌ చేసుకున్నాడు. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్‌ అయిన ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు.

 

హీరోగా ఎన్టీఆర్‌కు గుర్తింపు తెచ్చిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఈ సినిమా ఎన్టీఆర్‌కు తొలి సక్సెస్‌ ఇచ్చినా.. మాస్ హీరోగా ఎన్టీఆర్‌ కెరీర్‌ను సుస్థిరం చేసిన సినిమా మాత్రం సింహాద్రి. ఈ సినిమా ఎన్టీఆర్‌ మాస్ ప్రేక్షకుల అభిమాన నటుడిగా మారిపోయాడు. ఒక్కసారిగా తార స్థాయికి చేరిన ఇమేజ్‌ను హ్యాండిల్‌ చేయటంలో ఎన్టీఆర్‌ తడబడ్డాడు. దీంతో వరుస ఫ్లాప్‌లు ఎన్టీఆర్‌ను ఇబ్బంది పెట్టాయి.

 

యమదొంగ, అదుర్స్‌, బృందావనం లాంటి హిట్స్ వచ్చినా కెరీర్‌ పరంగా ఓ స్థిరత్వం అందుకోవడానికి ఎన్టీఆర్‌కు చాలా కాలం పట్టింది. ఎదురుదెబ్బలతో రాటు తేలిన ఎన్టీఆర్‌.. టెంపర్‌ సినిమా నుంచి పూర్తిగా రూటు మార్చాడు. మాస్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌లోనే ప్రయోగాలకు కూడా రెడీ అంటు నాన్నకు ప్రేమతో లాంటి డిఫరెంట్ సినిమా చేశాడు. అప్పటి నుంచి వరుసగా జనతా గ్యారేజ్‌, జై లవ కుశ, అరవింద సమేత సినిమాలో సత్తా చాటాడు ఎన్టీఆర్‌. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్నాడు తారక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: