స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ స్టేటస్ కైవ‌సం చేసుకున్నాడు. అంటే అది ఊరికినే రాలేదు. ఈ స్టార్ స్టేటస్ వెనుక ఎన్టీఆర్ పడిన కష్టం కంటే లెక్కకు మిక్కిలిగా ఎదుర్కొన్న అవమానాలు చాలా చాలానే ఉన్నాయి. ఎన్టీఆర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు తన సొంత కుటుంబానికి చెందిన వాళ్లతో పాటు తన బంధువులతో ఎడతెగని మానసిక సంఘర్షణ ఎదుర్కొంటూ వాళ్ళు పెట్టిన అవమానాలు దిగమింగుకుంటూ ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. ఈ రోజు ఎన్టీఆర్ కు నందమూరి అభిమానుల్లోనే కాకుండా తెలుగుదేశం పార్టీ అభిమానుల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి అంతటిలోనూ తిరుగులేని ఆత్మాభిమానం సొంతం అయింది.

 

2011లో ఎన్టీఆర్ పెళ్లి జరిగాక అటు సినిమా కెరీర్ పరంగా ఇటు వ్యక్తిగత కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. శక్తి, దమ్ము, రామయ్య వస్తావయ్యా, రభస ఇలా వరుస పెట్టి ఫ్లాపులతో ఎన్టీఆర్ కెరీర్ కుదేలైంది. అటు సొంత కుటుంబానికి చెందిన బంధువులే ఎన్టీఆర్ పై కక్ష కట్టి ఆయన కెరీర్ ను ఎక్కడపడితే అక్కడ అణగదొక్కేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు తెలుగుదేశం పార్టీలో కొంతమంది సినిమా అంటూ ప్రచారం చేసేవారు ఇలా ఎన్నో క్రాప్ అయ్యాయి.

 

సహజంగా ఏ సినిమా హీరోకి అయినా తన తోటి స్టార్ హీరోలతో గట్టి పోటీ ఉంటుంది. కానీ ఎన్టీఆర్ తన తోటి పోటీ హీరోల కంటే సొంత కుటుంబం నుంచే ఎన్నో కుట్రలు కుతంత్రాలతో పాటు గట్టిపోటీ ఎదుర్కొన్నాడు. టెంపర్ సినిమా నుంచి వరుస హిట్లతో దూసుకుపోతున్న తిరుగులేని రికార్డ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ను ఎంత అణగదొక్కాలని చూస్తే అంతకంతకూ పైకి ఎదుగుతూ ఎవరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతున్నాడు. దీంతో నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూసిన వాళ్ళు నేడు పెన‌వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

మరింత సమాచారం తెలుసుకోండి: