జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. 2001లో హీరోగా `నిన్ను చూడాలని` చిత్రంతో టాలీవుడ్ ఇచ్చాడు ఈయ‌న‌. ఇక ఆ త‌ర్వాత ఎన్నో సినిమాలు చేసి ప్రేక్ష‌కుల్లో త‌నకంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. తెలుగు ఇండస్ట్రీలో భీభత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి వంశంలో ప్రస్తుతం అత్యధిక మార్కెట్ ఉన్న హీరో కూడా ఈయనే. టాలీవుడ్ టాప్ 3 యాక్టర్స్‌లోనూ ఉన్నాడు జూనియర్. అలాగే  పదేళ్ల కిందే రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్లు కూడా నిండని వయసులోనే తన స్పీచులతో దంచేసాడు ఈ యంగ్ టైగర్.  అప్పట్లో తెలుగుదేశం తరఫున ఈయన చేసిన ప్రచారం సంచలనమే. 

 

పార్టీ ఓడిపోయినా కూడా జూనియర్ మాత్రం తన మాటలతో ఆకట్టుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత.. ఇలా వరుస హిట్లతో తెలుగు సినీ పరిశ్రమలో పాత రికార్డులను బద్దలు కొడుతూ.. కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్‌కు మంచి గుర్తుంపు.. నిజ‌మైన స్టార్‌ని చేసింది.. కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రం `సింహాద్రి`. 2003లో విడుద‌లైన ఈ చిత్రానికి  ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వం వ‌హించారు. 

 

అలాగే ఈ చిత్రంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న భూమిక, అంకిత హీరోయిన్లుగా న‌టించారు. ఈ చిత్రం రికార్డులు బ‌ద్ద‌లు కొడుతూ.. ఎన్టీఆర్ స్టార్ డ‌మ్‌ను అమాంతం పెరిగేలా చేసింది. సింగ‌మ‌లైగా ఎన్టీఆర్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు నీరాజ‌నం ప‌ట్టారు. ఈ సినిమా తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయంతో ఎన్టీఆర్ అగ్ర నటులలో ఒకనిగా ఎదిగాడు. మ‌రియు ఆ రోజుల్లోనే 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడ‌డంతో పెద్ద సంచ‌ల‌నం సృష్టించింది ఈ చిత్రం. ప‌ల్లెటూర్ల నుంచి పెద్ద ఎత్తున ప్రేక్ష‌కులు త‌ర‌లివ‌చ్చి ఈ సినిమాను చూసేవారు. దీంతో కేవ‌లం 22 సంవ‌త్స‌రాల‌కే ఎన్టీఆర్ నిజ‌మైన స్టార్ హీరోగా నిలిచాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: