సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లకు ప్రేమలు ఎఫైర్ లు చాలా కామన్ అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే.  అయితే టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఇలాంటివి కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ఎప్పుడు రాలేదు. ఎన్టీఆర్ ఇలాంటి వివాదాలకు చాలా  దూరంగా ఉంటూ వచ్చాడు. సహజంగా ఏ హీరో అయినా ఒక హీరోయిన్‌ను పదే పదే రిపీట్ చేసిన క్లోజ్ గా ఉన్న వాళ్ళిద్దరికీ ఏదో జరుగుతుందని మన మీడియా చిలువలు పలువలు చేసి రాతలు రాసేస్తూ ఉంటుంది.

 

అయితే ఎన్టీఆర్ విషయంలో ఇలాంటి రాతలు గుసగుసలు రాకపోయినా ఒక హీరోయిన్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఇవి ఎదుర్కోక తప్పలేదు. ఆ హీరోయిన్ ఎవరో కాదు మన తెలుగు అమ్మాయి సమీరా రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ కు చెందిన అమ్మాయి.  సమీరా రెడ్డి తండ్రి ముంబైలో ఉద్యోగం చేయడంతో ఆమె చిన్నప్పుడే అక్కడకు వలస వెళ్లింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారిన సమీరారెడ్డి ఎన్టీఆర్ తో రెండు సినిమాల్లో నటించింది. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన నరసింహుడు సినిమా తో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన అశోక్ సినిమాల్లో ఆమె ఎన్టీఆర్ పక్కన నటించింది. సమీరా రెడ్డి ని ఎన్టీఆర్ సినిమాల్లో రిపీట్ చేయడం తో వారిద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ న‌డుస్తున్న‌ట్లు అప్పట్లో వినిపించాయి.

 

మరికొందరు గాసిప్ రాయుళ్ళు అయితే ఎన్టీఆర్ ఆమెకు ఫ్లాట్ ఇచ్చాడని ఆమెను పెళ్లి చేసుకుంటున్నాడు అని కూడా రాశారు. అయితే ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అయ్యాయి. చివరికి ఎన్టీఆర్ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. ఎన్టీఆర్ ఎంతో మంది హీరోయిన్లతో నటించిన ఏ హీరోయిన్ విషయంలో రాణి సంథింగ్ కారు ఒక సమీరా రెడ్డి విషయంలో మాత్రమే రావడం విశేషం. ఆ తర్వాత మరో హీరోయిన్ విషయంలోనూ ఇలాంటి పుకార్లు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: