ఎన్టీఆర్ సినిమాలు ఎన్నో అద్భుతమైన విషయాలు సొంతం చేసుకున్నాయి.  రామాయణం మొదలుకొని రీసెంట్ గా వచ్చిన అరవింద సమేత వరకు ఎన్టీఆర్ నటన అమోఘం అని చెప్పాలి.  ఈ సినిమాలు ఆయన్ను ఎలా నడిపించాయో చెప్పక్కర్లేదు.  టెంపర్ సినిమాకు ముందు ఎన్టీఆర్ కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.  దీని నుంచి బయటపడేందుకు ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారు.  


అయితే, ఆంధ్రావాలా వంటి ఫెయిల్ ఇచ్చిన పూరిని ఎన్టీఆర్ మరోసారి నమ్మారు.  ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు సిద్ధం అని చెప్పిన తరువాత పూర్తిగా మారిపోయింది.  టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ ను చాలా కొత్తగా చూపించారు.  బ్యాడ్ కాప్ అంటూ చూపించి మెప్పించారు.  ఎన్టీఆర్ లో దాగున్న మరోకోణాన్ని బయటకు తీయడంలో పూరి సక్సెస్ అయ్యారు.  ఇదే ఎన్టీఆర్ కు ప్లస్ అయ్యింది.  


ఆంధ్రావాలా వంటి ప్లాప్ ఇచ్చినా, పూరికి ఎన్టీఆర్ ఎలా అవకాశం ఇచ్చారు అన్నది ఎవరికీ తెలియడం లేదు.  పూరి కథలకు ఉండే డిమాండ్ అలాంటిది.  పోనీ పూరి టెంపర్ కంటే ముందు మంచి ఫామ్ లో ఉన్నారా అంటే లేదు.  ఆయనకూడా అపజయాలు ఎదుర్కొంటూనే ఉన్నాడు.  కానీ, ఎన్టీఆర్ కు చెప్పిన కథ ఆయనకు నచ్చడంతో సినిమా మొదలైంది.  టెంపర్ తెరమీదకు వచ్చింది.  


ఎన్టీఆర్ నెగెటివ్ కోణాన్ని బయటకు చూపిస్తూనే ఆయనలోనే ఎనర్జీని బయటపెట్టారు.  అంతేకాదు, ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన నటన అన్ని కోణాల్లో విమర్శకుల మెప్పు పొందింది.  అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎన్టీఆర్ హవా మొదలైంది.  వరస హిట్స్ తో దూసుకుపోతున్నారు.  వరసగా ఆరు హిట్స్ సొంతం చేసుకొని డబుల్ హ్యాట్రిక్ సాధించారు.  ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి: