సినిమా ఇండస్ట్రీ అయినా రాజకీయమైనా.. ఏ వృత్తిలో అయినా వారసత్వం ఉంటుంది. అయినా.. పైకి రావాలంటే కష్టపడటం కంటే ప్రత్యామ్నాయం మరేదీ లేదని ఎందరో నిరూపించారు. సినిమాను, నటీ నటులను తమ సొంతవాళ్లలా భావించే టాలీవుడ్ లో మరీ ముఖ్యం. నందమూరి తారక రామారావు తర్వాతి తరం నుంచి నేటి జనరేషన్ వరకూ వారసత్వం నిలుపుకోవాలని ఎవరికైనా ఉంటుంది. అలా వారసత్వంగా వచ్చి ప్రజెంట్ జనరేషన్ లో టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్న ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. నందమూరి వంశం అనే బ్రాండ్ ఉన్నా కూడా ఎన్టీఆర్ కష్టపడే పైకి వచ్చాడనేది నిర్వివాదాంశం.

 

 

చేసిన మొదటి సినిమా నుంచి నందమూరి వంశం నుంచి అంతగా సపోర్ట్ ఎన్టీఆర్ కు అందలేదన్నది ప్రేక్షకుల అభిప్రాయం. బాలనటుడిగానే తానేంటో నిరూపించుకున్న ఎన్టీఆర్ ఆది సినిమాతో తన నటనలోని పవర్ ఏ స్థాయిలో ఉంటుందో నిరూపించాడు. తాత అంశను పూర్తిగా పుణికిపుచ్చుకుని వచ్చాడని ప్రేక్షకులు భావించారు. కానీ అంతకంటే ఎక్కువగా ప్రతి సినిమాలో తాను శ్రమించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకున్న విధానం ఇక్కడ ప్రస్తావనార్హం. ప్రేక్షకులను కట్టిపడేసే నటన, డ్యాన్సులు, నిర్మాత-దర్శకులకు మెయిన్ ఆప్షన్ గా మారిన అతని క్రేజ్ గా మారిపోయాడు. ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించి తాను వారసత్వపు ముసుగులో రాలేదని.. తనలో టాలెంట్ కూడా పుష్కలంగా ఉందని చాటిచెప్పాడు.

 

 

చిన్న వయసులోనే స్టార్ డమ్ సంపాదించిన హీరోగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించాడు. 2003లో సింహాద్రితో వచ్చిన స్టార్ డమ్ ఆ వయసులో మరే హీరోకు రాలేదనే చెప్పాలి. వారసత్వం ఇంటి పేరుకే పరిమితమై కష్టంతోనే పైకొచ్చాడు ఎన్టీఆర్. ఎందుకంటే ఎన్టీఆర్ కు ఉన్న అభిమానులు నందమూరి అభిమానులమని చెప్పుకోరు.. కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని మాత్రమే చెప్పుకుంటారు. వీరంతా జూనియర్ సంపాదించుకున్న ఆస్తి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: