జ‌క్క‌న  రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా   తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఈ చిత్రంలోని ఓ ఫొటో ప్ర‌స్తుతం లీక్ అయింది. ఫ్యాన్స్ ఆ ఫొటోను సోష‌ల్ మీడియాలో పెట్టి వైర‌ల్ చేస్తున్నారు. అయితే ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలోని ఫొటోలు కాని స‌న్నివేశాలు కానీ ఏవీ బ‌య‌ట‌కు రాకుండా జ‌క్క‌న్న ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ జ‌రిగేవి జ‌రిగిపోతూనే ఉన్నాయి. అయితే రామ్‌చ‌ర‌ణ్ అల్లూరిసీతారామ‌రాజుగా ఉన్న ఫొటో ఒక‌టి వైర‌ల్ అవుతుంది. ఆ ఫొటోని చూసిన ఫ్యాన్స్ లైకుల మీద లైకులు కొడుతూ హ‌డావిడి చేసేస్తున్నారు.  ఇంత‌కీ అది సెట్స్ నుండి లీక్ అయిందా లేక ఫ్యాన్స్ ఉత్సాహంతో వారికి వారే  ఓ ఫొటోని క్రియేట్ చేసి సోష‌ల్ మీడియాలో హంగామా చేస్తున్నారా అన్న విష‌యం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఫొటోని చూసిన‌ రాజ‌మౌళి మాత్రం హ‌డ‌లెత్తిపోవ‌ల‌సిందే. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ రాజ‌మౌళిని హ్యాక‌ర్స్ మాత్రం హ‌డ‌లెత్తిస్తున్నారు.

 

నిర్మాత డివివి దాన‌య్య దాదాపు 350కోట్ల బ‌డ్జెట్ తో చేస్తున్న ఈ చిత్రంలో  ఆలియా భ‌ట్, ఒలీవియో హీరోయిన్లు ఆడిపాడ‌నున్నారు. స్వాతంత్య్ర కాలం నాటి ఫిక్ష‌న్ డ్రామాతో ఈ సినిమా తెర‌కెక్కుతుంది.  ఈ సినిమాలో సుమారు ఏడు పాటలు ఉంటాయని స‌మాచారం.ఆవేశంతో కూడినవి, చైతన్యం రగిల్చేవి, ప్రేమ పాటలు కూడా ఉండొచ్చని వినికిడి. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన కొన్ని పాటలను ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ రాశారని సమాచారం.

 

అయితే ఈ ఫొటోను చూస్తుంటే మాత్రం మెగాఫ్యాన్స్ అభిమానం కొద్ది త‌మ స్టైల్లో క్రియేట్ చేశారేమో అనిపిస్తుంది. మ‌రి దీని పై రాజ‌మౌళి అయితే ఇంకా ఏమీ స్పందించ‌లేదు. మొత్తానికి సినిమా విడుద‌లై వారి స్టిల్స్ వ‌చ్చేవ‌ర‌కు కూడా మ‌న‌వాళ్ళు ఆగ‌లేక‌పోతున్నారు. ఇక ఈ చిత్రంలో రాంచ‌రణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి మ‌ల్టీస్టార‌ర్‌గా నటిస్తున్నారు. డి.ఎ. దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐతే ఎన్టీఆర్ కంటే ముందు చరణ్ ని అల్లూరి సీతారామరాజుగా రాజమౌళి పరిచయం చేసే అవకాశం ఉంది. కారణం రాజమౌళి వీరి పుట్టిన రోజులు కానుకగా ఫస్ట్ లుక్స్ విడుదల చేయాలని భావిస్తున్నాడట, ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పుట్టిన తేదీ మే 20కాగా, చరణ్ బర్డ్ డే మార్చ్ 27 కాబట్టి…ఎన్టీఆర్ కంటే ముందు చరణ్ ని అల్లూరిగా రాజమౌళి పరిచయం చేసే అవకాశం ఉందని స‌మాచారం. ఇక ఈ చిత్రం విడుద‌ల కోసం ఫ్యాన్స్ తెగ కళ్ళు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. రాజ‌మౌళి సినిమా అంటే ఎంత క్రేజ్‌తో ఎదురు చూస్తారో అంతే క్రేజ్‌తో వెయిట్ కూడా చేయాల్సి వ‌స్త‌ది. 

మరింత సమాచారం తెలుసుకోండి: