తమిళనాట హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శింబు. తమిళ లోనే కాకుండా కన్నడ తెలుగులో కూడా హీరోశింబూ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే శింబు నటించిన పలు సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించాయి. అయితే పలు సినిమాల్లో వైవిద్యాత్మక సినిమాల్లో నటిస్తూ  తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు శింబు. అయితే తమిళనాట శింబు  సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువగా తెరమీద కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎఫైర్ల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు సినీ ప్రేక్షకులు. ఓ  విధంగా ఇలా కూడా శింబు కి బాగా క్రేజ్ పెరిగిపోయింది అనే చెప్పాలి. 

 

 ఇకపోతే తమిళ హీరో శింబు గతంలో హన్సికతో ప్రేమలో పడటం బాగా హైలెట్ గా మారిపోయింది. వీరిద్దరు ప్రేమాయణంతో అప్పట్లో ఎన్నో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. హన్సిక శింబు తో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఎన్నో రోజుల గాసిప్స్ కూడా వెలువడ్డాయి. కానీ చివరికి శింబు హన్సిక ప్రేమ కాస్త బ్రేకప్ ఐపోయింది. అయితే హన్సిక తో బ్రేక్ అప్ అయినప్పుడు తమిళ హీరో శింబు ఎంతో మానసికపరమైన ఒత్తిడికి  కూడా లోనయిన్నట్లు తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో  హీరో శింబు ఇప్పట్లో ప్రేమ జోలికి వెళ్లకూడదని అనుకుంటున్నట్లు సమాచారం. 

 


 కానీ అన్న కోడి అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైన సుభిక్ష అనే హీరోయిన్ తో... హీరో శింబు ప్రేమలో పడ్డారు అంటూ  కోలీవుడ్లో మాత్రం బలంగా వినిపిస్తోంది. హీరో శింబు హీరోయిన్ సుభిక్ష త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వస్తున్న వార్తలపై హీరోయిన్ సుబిక్షా స్పందిస్తూ... నేను శింబు  మంచి స్నేహితులం మాత్రమేనని మా ఇద్దరి మధ్య ప్రేమ లాంటివి ఏమీ లేవు అంటూ క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం  ప్రేమలో ఉన్నామంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటూ తెలిపింది. ఓ ఫంక్షన్ కి మేము ఇద్దరం కలిసి హాజరు కావడం ఈ వార్తకు కారణమై ఉండొచ్చు... కానీ ఇకనైనా ఈ పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టండి. ముందు ముందు  నేను శింబుతో కలిసి చాలా సినిమాలు చేయాల్సి ఉంది అంటూ చెప్పుకొచ్చింది సుభిక్ష.

మరింత సమాచారం తెలుసుకోండి: