డాన్స్ లో అతన్ని కొట్టే వాడు ఉన్నాడా...?జూనియర్ ఎన్టీఆర్... నటన పరంగా చూసినా ఫాలోయింగ్ పరంగా చూసినా ఏ విధంగా చూసినా సరే ప్రస్తుతం టాలివుడ్ లో అతన్ని మించిన యాక్టర్ లేడు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రస్తుతం టాలివుడ్ లో చాలా మంది స్టార్ వారసుల కంటే కూడా తారక్ ముందు వరుసలో ఉన్నాడు. నందమూరి కుటుంబం అనే పేరు మాత్రమే తీసుకున్న తారక్ నటన విషయంలో తాను మైమరిపించే స్థాయిలో ఉంటుంది అనేది వాస్తవం. డాన్స్ విషయానికి వస్తే, ప్రస్తుతం టాలీవుడ్ లో తారక్ ని మించిన స్థాయిలో ఎవరూ కూడా డాన్స్ లో పోటీ వచ్చే అవకాశమే లేదని అంటున్నారు అతని అభిమానులు. 

 

ఎందరో సిని పరిశీలకులు కూడా తారక్ డాన్స్ చూసి మైమరిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఏ విధంగా అయినా సరే డాన్స్ లో అభిమానులను అలరిస్తాడు. అతని డాన్స్ చెయ్యాలి అంటే చాలు హీరోయిన్లు భయపడిపోయే పరిస్థితి ఉంటుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఎలాంటి స్టెప్ అయినా సరే సింగల్ టేక్ లో డాన్స్ మాస్టర్ అంచనాలకు కూడా అందని విధంగా డాన్స్ చేయడం తారక్ సొంతం. అతని సినిమాలు చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది ఏ స్టెప్ అయినా సరే స్వేచ్చగా అవలీలలగా వేయడంలో దిట్ట తారక్. 

 

అందుకే డాన్స్ మాస్టర్ కాన్సెప్ట్ చెప్పడమే గాని అతనికి ఇలా చెయ్యాలి అని చెప్పిన సందర్భం అంటూ పెద్దగా ఏమీ లేదు అనేది వాస్తవం. అతని డాన్స్ చూసి ఇతర నటులు కూడా ఎన్నో నేర్చుకుంటూ ఉంటారు. తన సినిమాల్లో నటన ఏ విధంగా ఉంటుందో డాన్స్ కూడా అదే విధంగా ఉంటుంది. నటనలో వైవిధ్యం చూపించినట్టే డాన్స్ లో కూడా వైవిధ్యం చూపిస్తూ ఉంటాడు. అతని డాన్స్ మీద పరిశీలకులు రివ్యూస్ రాస్తారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. హీరోలకు అతీతంగా అతని డాన్స్ కి అభిమానులు ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: