మెగా కుటుంబానికి, నందమూరి కుటుంబానికి సినిమాల పరంగా ఉండే పోటీ గురించి అందరికి తెలిసిన విషయమే. చాలా వరకు వాళ్ళ మధ్య ఎక్కువగానే పోటీ ఉంటుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం, సంక్రాంతికి ఈ రెండు కుటుంబాల నుంచి సినిమా వస్తుంది అంటే చాలు అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. గతంలో ఒకరికి ఒకరు పోటా పోటీగా అభిమానులు హడావుడి చేస్తూ ఉంటారు. సీనియర్ ఎన్టీఆర్ ఉన్న సమయంలో ఈ స్థాయిలో పోటీ ఉండేది కాదు గాని బాలకృష్ణ, చిరంజీవి మధ్య మాత్రం ఒక స్థాయిలో ఉండేది అనే సంగతి తెలిసిందే. 

 

ఇక జూనియర్ కూడా సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత మెగా కుటుంబం ఇబ్బంది పడింది. సంక్రాంతికి అతనికి పోటీగా సినిమా విడుదల చెయ్యాలి అంటే ఆలోచించే పరిస్థితి ఉండేది. ఒకానొక దశలో బాలకృష్ణ వరుస ఫ్లాపులతో ఇబ్బ౦ది పడ్డారు. ప్రధానంగా చిరంజీవి ఎదుర్కోవడానికి బాలకృష్ణ ఎక్కువగానే కష్టపడ్డారు. అయినా సరే చిరంజీవి కి ఉన్న మాస్ ఫాలోయింగ్ ముందు ఆయన నిలబడలేకపోయాడు. ఆ సమయంలో నందమూరి కుటుంబం సినిమాల పరంగా నిలబడింది అంటే దానికి ప్రధాన కారణం జూనియర్ అని అంటూ ఉంటారు. 

 

వరుసగా బాలకృష్ణ నుంచి ఫ్లాపులు వస్తున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ హిట్లు కొట్టడమే కాకుండా సిని పరిశ్రమను షేక్ చేసాడని విశ్లేషకులు కూడా అంటూ ఉంటారు. దీనితో అప్పటి నుంచి నందమూరి అభిమానులకు అతని మీద అభిమానం పెరిగిందని అంటూ ఉంటారు. నందమూరి, మెగా హీరోలు ఎలా ఉన్నా సరే అభిమానులు మాత్రం పరువుగా భావిస్తూ ఉంటారు కాబట్టి సినిమా హిట్ అవ్వడం అనేది చాలా అవసరం. లేకపోతే తల తెగినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. వారికి తారక్ రూపంలో ఒకానొక సందర్భంలో మంచి అండ దొరికిందని... ఈ సమయంలో తారక్ లేకపోయి ఉంటే మెగా కుటుంబం ధాటికి ఇప్పుడు అసలు బాలకృష్ణ తట్టుకోలేకపోయే వారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: