దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ సినిమా అనగానే టాలివుడ్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ సినిమా కూడా ఇప్పటి వరకు సూపర్ హిట్ అయింది. దీనితో వీరికి ఉండే డిమాండ్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది అనేది వాస్తవం. అందుకే తారక్ తో సినిమా చెయ్యడానికి రాజమౌళి ఎప్పుడూ సిద్దంగానే ఉంటాడు అనేది టాలివుడ్ పరిశీలకుల మాట. సోషల్ మీడియాలో కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ కి ఒక రేంజ్ ఉంటుంది. నిర్మాతలు కూడా వీరితో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. 

 

అయితే అసలు వీరి కాంబినేషన్ కి ఇంత క్రేజ్ ఉండటానికి ప్రధాన కారణం రాజమౌళీనే అంటున్నారు సిని పరిశీలకులు. దానికి కారణం ఏంటో కూడా చెప్తున్నారు వాళ్ళు. తారక్ తో తొలి సినిమా చేసినప్పుడు వీళ్ళకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. దీనితో రాజమౌళి తారక్ ని తన కథకు తగినట్టు అన్ని విధాలుగా వాడుకున్నాడు. అప్పుడు తారక్ లో ఉన్నప్పుడు నటుడు పూర్తి స్థాయిలో బయటకు రావడమే కాకుండా సింహాద్రి సినిమా తర్వాత వీరిది ఎంత హిట్ కాంబినేషన్ అనేది ప్రపంచానికి అర్ధమైంది. తారక్ తో సినిమా చేస్తే నటనకు ప్రాధాన్యత ఉంటేనే కథ రాసుకుంటాడు. 

 

తారక్ నుంచి తాను ఏమి ఆశిస్తున్నాడో అది దొరుకుతుంది అని చాలా మంది తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. తన సినిమాకు తారక్ ఏ ఎసెట్ అని, అతనితో సినిమా చేస్తే తాను నటన విషయంలో, సీన్స్ విషయంలో భయపడే పని ఉండదని, ఒక దర్శకుడికి తన నుంచి ఎం కావాలో తారక్ కి తెలుసు అని అందుకే తనకు తారక్ తో సినిమా చేయడం అంటే ఎంతో ఇస్తామని తన సన్నిహితుల వద్ద పలు మార్లు చెప్పినట్టు సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. తారక్ తో సినిమా చేస్తే నేర్చుకోవచ్చని, దర్శకుడికి ఎంతో బలం అని కూడా చెప్పినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: