ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఏదో ఒక సైడ్ రోల్ చేసిన కుర్రాడు.. ఆ వెంటనే పెళ్లిచూపులు అంటూ వచ్చి హిట్ అందుకున్నాడు. తరుణ్ భాస్కర్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పెళ్లిచూపులు సినిమా సూపర్ హిట్ అయ్యింది. యూఎస్ లో 50 రోజులు ఆడిన ఈ సినిమా విజయ్ కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ నటన చూసి ఆడియెన్స్ కు పిచ్చెక్కింది. రెండు సినిమాల అనుభవం అది కూడా ఒకటి సైడ్ రోల్ మరోటి హీరో.. అలాంటి అతను ఈ రేంజ్ లో పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమా అని అందరు ముక్కున వేలేసుకున్నారు.

 

అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ దేవరకొండ నటించాడు అని చెప్పడం కన్నా జీవించేశాడు అనడం కరెక్టేమో. సందీప్ వంగ చెప్పినట్టు చేసినా అర్జున్ రెడ్డి పాత్రను విజయ్ నటించిన తీరుకి యూత్ ఆడియెన్స్ అంతా ఫిదా అయ్యారు. ఇక ఆ తర్వాత ఆ సినిమాకు ఏమాత్రం సంబందం లేకుండా వచ్చిన గీతా గోవిందం సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో మేడం మేడం అంటూ ఓ కాం మంచి పాత్రలో కనిపించాడు విజయ్. ఇక అప్పటి నుండి విజయ్ సినిమా అంటే యూత్ లోనే కాదు సగటు సిని ప్రేక్షకుడికి ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగింది.

 

ఇక లేటెస్ట్ గా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చూసిన తర్వాత విజయ్ ను కొంతమది పొగిడేస్తుండగా.. మరికొంతమంది మాత్రం తిడుతున్నారు. విజయ్ ఇంకా అర్జున్ రెడ్డి ఫీవర్ లో ఉన్నాడని అంటున్నారు. అయితే విజయ్ ఎలాంటి పాత్ర అయినా చేయగలడు.. అతనికోసం కొత్త పాత్ర రాసుకునే సత్తా దర్శకులకు ఉంటే చాలు తను ఎలాంటి రోల్ అయినా సరే అవలీలగా చేస్తాడు. వరల్డ్ ఫేమస్ లవర్ లో కూడా ప్రేమకు ఎంతో విలువనిచ్చే ప్రేమికుడిగా కొన్ని సీన్స్ లో పిచ్చోడిలా తను అభినయించిన తీరు అతనిలోని నటుడిని గుర్తుచేస్తుంది. అయితే సినిమా ఆడితేనే కమర్షియల్ గా బాగుంటుంది కాబట్టి ఇకమీదట విజయ్ కథల మీద కూడా కొద్దిగా దృష్టి పెడితే బాగుంటుందని కొందరు సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: