ఒకప్పటితో పోలిస్తే ప్రజలకు ఎంటర్టైన్మెంట్ సాధనాలు నేటి కాలంలో విపరీతంగా పెరిగాయి. అప్పట్లో కేవలం సినిమాలు మాత్రమే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ని అందిస్తే, ఆ తరువాత టివిలు, కంప్యూటర్స్ రాక ప్రారంభం అయింది. ఇక ఇటీవల కాలంలో వీడియో గేమ్స్, యూట్యూబ్, ఓటిటి ప్లాట్ ఫామ్స్ వంటివి అనేకం వచ్చి ఒకింత సినిమాకు దెబ్బేస్తున్నాయి. ఇక ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో ఎక్కువగా అమెజాన్, నెట్ ఫ్లిక్, హాట్ స్టార్, జీ 5, సన్ నెక్స్ట్ వంటివి ఉన్నప్పటికీ, అందులో ఏ ఒక్కటీ కూడా మన వాళ్ళది కాదు. అలానే థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా, దాదాపుగా 30 నుండి 40 రోజుల్లో ఆయా ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో దర్శనం ఇస్తోంది. 

 

ఇక ప్రజలు కూడా వాటికి బాగా అలవాటు పడుతూ, వాటిలో ఎప్పటికప్పుడు నెలవారీ, అలానే సంవత్సర చందాదారులుగా చేరుతూ ఆయా ప్లాట్ ఫామ్స్ కు మంచి ఆదాయాన్ని అందిస్తున్నారు. అయితే మనకంటూ ఒక ఓటిటి ప్లాట్ ఫామ్ ఉండాలనే ఉద్దేశ్యంతో, ఆ రంగంపై కొంత దృష్టిపెట్టిన గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, ఇటీవల ఆహా పేరుతో ఒక ఓటిటి ప్లాట్ ఫామ్ ని ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేసారు. ఇటీవల హీరో విజయ్ దేవరకొండ ప్రత్యేక అతిథిగా జరిగిన ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ ఓపెనింగ్ వేడుకలో అరవింద్ మాట్లాడుతూ, మన తెలుగు వారి కోసం చాలావరకు తక్కువ ధరలు గల ప్యాకేజీలతో దీనిని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇకపై రాబోయే కొత్త సినిమాలను కూడా మా సంస్థ వీలైనంతవరకు దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. 

 

మొదట నిఖిల్ సిద్దార్ధ హీరోగా తెరకెక్కిన అర్జున్ సురవరం సినిమాని కొన్న ఆహా వారు, కార్తీ నటించిన సూపర్ హిట్ మూవీ ఖైదీ ని కూడా నిన్న కొనుగోలు చేసారు. అటు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి విజయవంతం అయిన ఈ సినిమా డిజిటల్ హక్కులు తమకు లభించడం ఎంతో ఆనందంగా ఉందని, ఆహా సంస్థ ఒక పోస్ట్ ద్వారా తెలిపింది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: