టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఒకరైన నితిన్ ఇప్పుడు తన బ్యాచిలర్ లైఫ్ లో గుడ్ బై చెప్పి ఫ్యామిలీ మ్యాన్ కాబోతున్నాడు. కొన్నాళ్లుగా నితిన్ మ్యారేజ్ గురించి వస్తున్న వార్తలని నిజం చేస్తూ ఫిబ్రవరి 15 శనివారం షాలినితో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు నితిన్. నితిన్ కాబోయే భార్య షాలిని ఎం.బి.ఏ పూర్తి చేసిన షాలినితో తనకు 8 ఏళ్లుగా పరిచయం ఉందని అంటున్నాడు నితిన్. 8 ఏళ్ల క్రితం ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా షాలినిని చూశానని.. ఐదేళ్లుగా ఆమెతో ప్రేమలో ఉన్నానని అన్నారు నితిన్.

 

షాలిని అందరిని ఎంతో ప్రేమగా పలుకరిస్తుంది.. తన సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం... నా ప్రొఫెషన్ ను చాలా బాగా అర్ధం చేసుకుంటుంది. అయితే ఇన్నాళ్లుగా ప్రేమలో ఉన్నా మా కెరియర్ లో మేము బిజీగా ఉండటం వల్ల ఈ విషయాన్ని బయట పెట్టలేదని. తనకు షాలిని పర్ఫెక్ట్ జోడీ అంటూ కాబోయే భార్య మీద ప్రేమ చూపిస్తున్నాడు నితిన్. మాములుగా అయితే సినిమా ప్రమోషన్స్ లో కూడా సిగ్గుతో మాట్లాడే నితిన్ పెళ్లి కాకుండానే తన సోల్ మెట్ గురించి అద్భుతంగా పొగిడేస్తున్నాడు.

 

షాలిని తన ఫ్యామిలీతో బాగా కలిసిపోయిందని.. ఆమెలాంటి వ్యక్తితో ప్రేమలో పడటం కష్టమేమి కాదని అన్నాడు నితిన్. మొత్తానికి ఐదేళ్లుగా సీక్రెట్ లవ్ చేస్తూ ఎవరికి డౌట్ రాకుండా మ్యానేజ్ చేసిన నితిన్ ను చూసి అందరు షాక్ అవుతున్నారు. ఇక ఈరోజు ఎంగేజ్మెంట్ పిక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నితిన్, షాలిని జంట చూడముచ్చటగా ఉంది. మొత్తానికి నితిన్ మంచి అమ్మాయిని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడంటూ అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏప్రిల్ 15న నితిన్ షాలినిల పెళ్లి దుబాయ్ లో జరుగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: