పూజా హెగ్డే రెమ్యునరేషన్‌ విషయంలో చుక్కలు చూపిస్తోంది. ఆమె సినిమాకు రెండుకోట్లకు పైగా డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు తన సిబ్బందితో కూడా నిర్మాతలను ఇబ్బంది పెడుతోందట. షూటింగ్‌ సమయంలో పూజా వెంట నలుగురైదుగురు అసిస్టెంట్ లు ఉండేవారు. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ సినిమా బ్లాక్‌బస్టర్‌ కావడంతో తన వ్యక్తిగత సిబ్బందిని ఆరుకి పెంచిందట. వీరి ఖర్చులన్నీ నిర్మాతే భరించాలి. పూజాను మెయిన్‌టెనెన్స్‌ చేసేందుకే నిర్మాతలు కిందా మీదా పడుతున్నారు. అలాంటిది ఏకంగా ఆరుగురిని భరించడం ద్వారా మరీ భారం పడుతోంది అంటున్నారు సినీ జనాలు.


ఇంతకీ ఆరుగురు సిబ్బంది అవసరమా ? అంటే.. ఆ విషయం పూజ కే తెలియాలి .ఎంతైనా స్టార్‌ హీరోయిన్‌ కదా…ఆ మాత్రం మెయిన్‌టెయిన్‌ చేయకపోతే బాగుండదని అనుకుంటుందేమో.. కానీ.. ఆమె పెట్టే కండీషన్స్‌ తో నిర్మాతలకు తిప్పలు తప్పడం లేదు .నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ ద్వారా టాలీవుడ్‌లో అడుగు పెట్టిన పూజా తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ హృతీక్‌ రోషన్ తో చారిత్రాత్మక చిత్రం ‘మొహంజదారో’లో నటించారు. ఆ సినిమా కోసం దాదాపు రెండేళ్లపాటు బాలీవుడ్‌కే అంకితమైపోయారు. అయితే బాలీవుడ్‌లో పూజాకు అంతగా గుర్తింపు రాకపోవడంతో మళ్లీ టాలీవుడ్‌కు వచ్చేశారు. ఆ తర్వాత తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘డీజే’, ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’, మహేష్‌ బాబుతో ‘మహర్షి’లో నటించి మంచి స్థానాన్ని సంపాందించుకున్నారు. ఇటీవల ఆమె బన్నీతో ‘అల వైకుంఠపురములో’ చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకుంది . వరుస హిట్లతో జోరుమీదున్న ఈ బ్యూటీ తాజాగా బాలీవుడ్‌ టాప్ హీరో సల్మాన్‌ ఖాన్‌ సరసన నటించే బంపర్‌ ఆఫర్‌ను కొట్టేసింది .

 

“మనిషి సుఖంగా జీవించడంలోనే ఆనందం ఉందనుకుంటాడు. అందుకోసం.. ఒకే రకమైన లైఫ్‌కు అలవాటు పడిపోతుంటాడు. అలా బతకడంలో తప్పు లేదు.. కానీ మనకంటూ ఓ గుర్తింపు రావాలంటే.. పదిమంది కంటే భిన్నంగా ఆలోచించాలి’ అని అంటోంది వరుస హిట్‌లతో టాప్ హీరోయిన్‌ మారిన పూజా హెగ్డే. పూజా తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ..”సవాలుతో కూడుకునే నిర్ణయాలు తీసుకునేందుకు నేను ఎప్పుడూ ముందుంటాను. జీవితంలో సాహసాలు చేయడం చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: