విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అంటున్నారు పలువురు. ఈ సినిమా చూసి వచ్చిన వాళ్ళు అయితే అట్టర్ ఫ్లాప్ అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ సినిమా కేవలం యూత్ కోసం తీసే క్రమంలో మరింత రెచ్చిపోయారు అని... సినిమాలో అసలు స్టొరీనే లేదు అంటూ మండిపడుతున్నారు ప్రేక్షకులు. అసలు సినిమా ఎందుకు తీసారో అర్ధం కాలేదు అంటున్నారు.  

 

వరల్డ్ ఫేమస్ లవర్ కాదు వరల్డ్ ఫేమస్ రాడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ సినిమాను సోషల్ మీడియాలో అందరూ బాగానే ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏ సినిమా అయినా ఒక్కసారి అయినా చూడవచ్చని కాని ఈ సినిమాను ఒక్కసారిగా చూడలేమని అంటున్నారు. ఈ సినిమాతో విజయ్ రేంజ్ పడిపోయినా ఆశ్చర్యం లేదని... సినిమాను కొనుగోలు చేసిన వారు భారీగా నష్టపోవడం ఖాయమని అంటున్నారు. వీకెండ్ లో కూడా ఈ సినిమా అసలు ఏ మాత్రం ప్రభావం చూపించడం లేదని, ఇతర సినిమాలకు వెళ్తున్నారు గాని ఈ సినిమాకు చూడాలని అనుకోవడం లేదని కామెంట్స్ వస్తున్నాయి.  

 

భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు చేయకుండా ఉంటే మంచిది అంటూ పలువురు సూచిస్తున్నారు. విజయ్ సినిమాలకు ప్రచారం ఎక్కువ మేటర్ తక్కువ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే దీనిపై ఇప్పుడు విజయ్ ఫాన్స్ కూడా విమర్శలు చేయడం గమనార్హం. ఇలాంటి చెత్త సినిమాలు తీసి ఉన్న పరువు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు. దర్శకులు కూడా అతనితో సినిమా చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలని చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: