విజయ్ దేవరకొండ ...టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ పేరు. ఒకే ఒక్క సినిమతో టాలీవుడ్ లో అసాధారణ క్రేజ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ టాలీవుడ్ యంగ్ హీరోలందరికి గట్టి పోటీగా తయారయ్యాడు. ఎంతగా అంటే వేరే హీరోలతో అనుకున్న కథలని ఆ హీరోలతో డ్రాపయ్యి విజయ్ వెనకపడేంత. పెళ్ళి చూపులు సినిమా తో మాంచి క్లాస్ హిట్ అందుకున్న విజయ్ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో అందరికి షాకిచ్చాడు. ఒక్క టాలీవుడ్ లోనేకాదు బాలీవుడ్ లోను క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా అక్కడ హాట్ హీరోయిన్స్ కి నిద్ర పట్టనివ్వడం లేదు ఈ రౌడీ హీరో. గీత గోవిందం సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిన విజయ్ దేవరకొండ రేంజ్ అమాతం పెరిగిపోయింది. 

 

అయితే ఆ రేంజ్ రెండు సినిమాలతో కాస్త తగ్గిపోయింది. నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలు రెండు దారుణంగా ఫ్లాపయ్యి విజయ్ క్రేజ్ తో పాటు తన మార్కెట్ ని బాగా దెబ్బ తీశాయి. ఎంతసేపటికి అదే పర్ఫార్మెన్స్ అదే ఆటిట్యూడ్ చూపిస్తున్నాడని విజయ్ దేవరకొండ ఫ్యాన్సే మాట్లాడుకున్నారు. ముఖ్యంగా డియర్ కామ్రేడ్ సినిమా విషయంలో చాలా విమర్శల్ని ఎదుర్కొన్నాడు మన రౌడీ హీరో. ఆ విమర్శలు చాలా రోజులు వెంటాయి. అవన్ని తట్టుకొని మళ్ళీ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో రెడీ అయిపోయాడు. పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి అంచానాలు పెంచుతూ వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక మాత్రం నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అక్కడనుంచి మొదలైన టాక్ సినిమా రిలీజ్ అయ్యాక దారుణంగా వచ్చింది. మళ్ళీ విజయ్ కి దారుణమైన ఫ్లాప్ పడిందని డిసైడయిపోయింది.

 

అయితే విజయ్ ఫ్యాన్స్ విజయ్ ని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. ఇక అర్జున్ రెడ్డి మూడ్ నుండి బయటకి రావా..ఏంటి చెత్త సినిమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ తర్వాత ఇన్ని సినిమాలు ఫ్లాపవుతాయా..! అసలు అలాంటి సినిమాని తీసిన ఆ 'అర్జున్ రెడ్డి' వంగా కనిపిస్తే కడిగిపారేస్తామని విజయ్ ఫ్యాన్స్ విజయ్ ని ఏకేస్తున్నారు. ఈ సినిమా మీద అంచనాలు పెట్టుకుంటే ఇది కూడా పోయింది. అర్జున్ రెడ్డి లాంటి సినిమా తీసి నీ జీవితాన్ని నాకించేశాడు అంటూ సందీప్ రెడ్డి వంగాని కామెంట్ చేస్తున్నారట.   

మరింత సమాచారం తెలుసుకోండి: