సాధారణంగా స్టార్స్ కూతుళ్ళు గాని కొడుకులు గాని ఇండస్ట్రీలోకి వచ్చాక ప్రేక్షకులను చేరుకోవడానికి, మెప్పించడానికి, ప్రేక్షకిఉల్లో క్రేజ్ ని , ఫాలోయింగ్ ని పెంచుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. జనరేషన్ గ్యాప్ తో తల్లి తండ్రులకి ధీటుగా ట్రెండ్ ఫాలో అవుతూ షాకిస్తుంటుంటారు. అసలు ఆ అమ్మాయి ఆవిడ కూతురేనా ..ఈ కుర్రాడు ఆ హీరో కడుపున పుట్టిన వాడేనా..మరీ ఇంత వైల్డ్ గా ఉన్నాడేంటి ..అంటూ రక రకాల కామెంట్స్ పడుతుంటాయి. ఇప్పుడు ఈ బ్యూటీని చూస్తుంటే కూడా అలాంటి కామెంట్సే పడుతున్నాయి.

 

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ ఇప్పటి వరకూ నటించింది ఒకే ఒక్క సినిమా. అదే మరాఠి సూపర్ హిట్ సినిమా 'సైరాట్' కు రీమేక్ గా తెరకెక్కిన 'ధడక్'. ఈ సినిమా ద్వారానే గ్రాండ్ గా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.  విమర్శకులను ఈ సినిమా మెప్పించలేకపోయినప్పటికి కమర్షియల్ గా మాత్రం హిట్ ని దక్కించుకుంది. ఇక జాన్వికి నటిగా యావరేజ్ అనిపించుకుంది. కానీ జాన్వికి ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా పెంచుకుంది.

 

మరీ ముఖ్యంగా జాన్వి రోజూ జిమ్ కు రావడం అనేది ఒక హాట్ ట్రీట్ గా మారింది. అందరూ జిమ్ముకు ఏదో ఒక స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని వెళ్తారు. కానీ జాన్వి ఒకరోజు వేసుకున్న జిమ్ము డ్రెస్ ఇంకోరోజు వేసుకోదు. డిజైనర్ వేర్ తరహాలో ప్రతి డ్రెస్సు సూపరే అని చూసినోళ్ళు నోరెళ్ళ బెట్టి చొంగ కార్చుకునేలా వేసుకొని చమటలు పుట్టిస్తుంది. సోషల్ మీడియా కూడా షేకవుతుంది జాన్వీ హాట్ ట్రీట్ దెబ్బకి. జిమ్ము డ్రెస్సులతో కూడా బాలీవుడ్ లో స్పెషల్ అట్రాక్షన్ ని క్రియోట్ చేయొచ్చునని జాన్వీ నిరూపించింది.

 

ఆ చిట్టిపొట్టి నిక్కర్లు.. టైటి ఫిట్ టీ షర్టుల గురించి రాస్తూపోతే ఒక్కొక్కరు ఒక్కో డైరీ రాసేస్తారు. అలా రోజూ జాన్వి జిమ్ము డ్రెస్సుల ఫోటోలు చూస్తూ ఉంటే దేవదాసుగా మారడం కూడా ఖాయమే అని కామెంట్స్ పడుతున్నాయి. అయితే ఈ విషయంలో జాన్విని విమర్శించేవారు కూడా చాలా మంది ఉన్నారు. జిమ్ము డ్రెస్సుల మీద పెట్టే శ్రద్ధలో పదోవంతు నటనపై పెడితే శ్రీదేవి పేరు నిలబెట్టొచ్చు అని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు కొందరైతే జాన్వీ అసలు శ్రీదేవీ కూతురేనా ..ఏంటా హాట్ నెస్ ఎక్కడ నుంచి వచ్చింది ..నమ్మలేకపోతున్నాం అంటూ సెటైర్స్ వేస్తున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: