ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే కామాంధులై ఒక ఒంటరి యువతిని చెరబట్టి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్భయ, దిశ అంటూ అమ్మాయిల పేర్లు మారుతున్నాయే కానీ వారికి పట్టిన దీనమైన తలరాత మాత్రం మారట్లేదు. ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకున్న హృదయ విచారకర సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా జరిగింది. అమానవీయ ఘటన వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్ జిల్లాలో గోరఖ్ నాథ్ లో ట్యూషన్ టీచర్ గా పని చేస్తున్న ఒక 24 ఏళ్ల యువతి రాత్రి పూట ఆమె అక్క ఇంటికి వెళ్లి తిరిగి బయలుదేరింది.

 

అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న యువతిపై ఇద్దరు పోలీసుల కన్ను పడింది. దీంతో యువతిని అడ్డుకున్న పోలీసులు నువ్వు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నావ్? అంటూ సూటి ప్రశ్నలు వేస్తూ అడ్డుకున్నారు. తాను ఫలానా అని తన వివరాలు మొత్తం చెప్పినా వారు వినిపించుకోలేదు సరికదా ఆమెతో అమర్యాదగా ప్రవర్తించిండం మొదలుపెట్టారు. సమయంలో ఒంటరిగా వెళుతుంటే "నువ్వు వేశ్య వు కదా...?" అని ప్రశ్నించారు. దీంతో యువతి భయాందోళనకు గురై జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టింది. అయితే యువతి వెనకాల తన తల్లి కూడా వస్తుంది కానీ పోలీసులు ఆమె వెనక తన తల్లి వస్తుందని చెప్పినా కూడా వినిపించుకోకుండా వారి నిజమైన బుద్ధిని చూపించారు.

 

సమాజాన్ని రక్షించాల్సిన రక్షకులే భక్షకులై యువ‌తిని బలవంతంగా తమ బైకుపై ఎక్కించుకొని.. రైల్వేష్టేషన్ దగ్గర్లోని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించగా తీవ్రంగా కొట్టి గాయపరిచారు. త‌ర్వాత కొన్ని గంట‌లు గ‌డిపాక రాత్రిపూట ఆమె చేతిలో రూ. 600 పెట్టి వెళ్లిపొమ్మన్నారు. జీవ‌శ్చ‌వంలా ఆమె ఆటోలో ఇంటికి చేరింది. పోలీసుల పైశాచిక‌త్వానికి తాను బ‌లి అయ్యాన‌ని క‌న్నీరుమున్న‌ర‌వుతూ తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: