షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న తెలుగు అమ్మాయి చాందిని చౌదరి. ఎం.ఆర్ ప్రొడక్షన్ షార్ట్ ఫిలింస్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న చాందిని సిల్వర్ స్క్రీన్ పై మాత్రం క్లిక్ అవలేదు. రెండు మూడు సినిమాలు చేసినా అవి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇదిలాఉంటే అమ్మడు ఇప్పుడు వెబ్ సీరీస్ ల మీద దృష్టి పెట్టింది. అహా మొదటి వెబ్ సీరీస్ మస్తిలో నటిస్తుంది చాందిని చౌదరి. నవదీప్, రాజ్, హెబ్బా పటేల్, బిందు మాధవి, అక్షర గౌడాతో పాటుగా చాందిని కూడా అందులో నటించింది.

 

నటించడమే కాదు నవదీప్ తో లిప్ లాక్ కూడా చేసింది చాందిని. అయితే హీరోయిన్ లిప్ లాక్ ఇవ్వగానే ఆమె బీ గ్రేడ్ హీరోయిన్ అయినట్టు కాదు. లేటెస్ట్ గా చాందిని తనని బీ గ్రేడ్ హీరోయిన్ అంటూ వార్తలు రాసిన మీడియాకు చురకలు అంటించింది. అసలు బీ గ్రేడ్ హీరోయిన్ అంటే అర్ధం తెలుసా..? మీలాంటి వాళ్ల వల్లే తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా నటించాలంటే భయపడుతున్నారు. మీకు మీరే సిగ్గుపడాలంటూ చెడామడా వాయించేసింది. కేవలం ఒక్క లిప్ లాక్ ఇచ్చినంత మాత్రాన బీ గ్రేడ్ హీరోయిన్ అనేయడం కరెక్ట్ కాదేమో.

 

చాందిని వాదనలో న్యాయం ఉందనే చెప్పొచ్చు. వెబ్ సీరీస్ లో ఇలాంటివి చాలా కామన్. తెలుగు ఓటిటి యాప్ లో మొదటి వెబ్ సీరీస్ గా వస్తున్న మస్తి వెబ్ సీరీస్ తో తన సత్తా చాటాలని చూస్తుంది చాందిని. ఎలాగు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావట్లేదు కాబట్టి ఇలా వెబ్ సీరీస్ లు చేసుకుంటూ కెరియర్ కొనసాగించాలని అనుకుంటుంది. షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఈ అమ్మడు వెబ్ సీరీస్ అనగానే లిప్ లాక్ కూడా సై అనడంతో ఆమెను ఏకంగా బీ గ్రేడ్ హీరోయిన్ అనేశారు. అందుకే అమ్మడు బాగా అప్సెట్ అయినట్టు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: