టాలీవుడ్ లో పూజా హెగ్డే కి ప్రస్తుతం ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరో నోట విన్నా, తమ సినిమాలో పెట్టమని దర్శక, నిర్మాతలని సలహాలిస్తుంది పూజా హెగ్డే, ఆ తర్వాత రష్మిక మందన పేర్లే. ముందుగా అయితే వినిపిస్తుంది పూజా దే. మొన్న సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ తన అకౌంట్ లో వేసుకుంది. ఈ సినిమాకి ఒక విశేషం ఉంది. పూజా కి గురూజి తో చేసిన రెండవ సినిమా అల వైకుంఠపురములో. అంతకముందు ఎన్.టి.ఆర్ హీరోగా తెరకెక్కించిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి కమర్షియల్ సక్సస్ ను అందుకుంది.

 

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా పూజా కి ఇది రెండవ సినిమా. ఈ సినిమాకి ముందు పూజా హెగ్డే స్టైలిష్ స్టార్ తో డీ.జే. ( దువ్వాడ జగన్నాధం ) సినిమాలో జంటగా నటించింది. హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా పూజా అకౌంట్ లో హిట్ సినిమానే. ఇక ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే డీ.జే. సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లోకి వచ్చింది. బన్నీ తోను గురూజీతోను పూజా రెండు సినిమాలు చేసింది. వాస్తవంగా పూజా వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమాతో టాలీవుడ్ లో మంచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాకి మంచి పేరు రావడంతో ఆ వెంటనే అక్కినేని నాగ చైతన్య కొండా విజయ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఒక లైలా కోసం సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.

 

ఈ రెండు సినిమాల తర్వాత పూజాకి తెలుగులో వరుసగా ఆఫర్స్ వచ్చాయి. ఆ సమయంలో పూజా చేతిలో దాదాపు 3-4 సినిమాలు ఉన్నాయట. కాని వాటన్నిటిని కాదనుకొని బాలీవుడ్ మీద మోజుతో హృతిక్ రోషన్ నటించిన మొహంజాదారో  సినిమాలో ఛాన్స్ వచ్చిందని టాలీవుడ్ సినిమాలన్నిటిని కాదనుకొని చెప్పచేయకుండా బాలీవుడ్ వెళ్ళిపోయింది. రెండేళ్ళ పాటు అసలు అడ్రసే లేదు. అయితే పూజా బ్యాడ్ లక్ బాలీవుడ్ లో నటించిన మొహంజాదారో ఘోరమైన పరాజయాన్ని మూట గట్టుకోవడమే కాకుండా పూజాకి కోలుకోలేని దెబ్బ పడేలా చేసింది. దాంతో బిక్కు బిక్కు మంటూ కూర్చుంది.

 

ఆ సమయంలో మళ్ళీ మన వాళ్ళు ఎటూ ఖాళీగా ఉంది కదా అని తీసుకు వచ్చి డీ.జే లో ఛాన్స్ ఇస్తే ఈ రోజు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పాపులర్ అయింది. కానీ మళ్ళీ అదే తప్పు చేస్తోంది పూజా. ఈ సారి పూజా కెరీర్ నాశనం అయితే అది బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వల్లే. ఎందుకంటే ఇక్కడ బిజీగా ఉన్న పూజా ని కెలికి ఛాన్స్ ఇస్తా అని ముంబై లాగేస్తున్నాడు. అసలే సల్మాన్ కి హిట్స్ దక్కడం లేదు. ఇక్కడ మాంచి ఫాంలో పూజా సల్మాన్ హీరో అని బాలీవుడ్ మీద మోజుతో వెళితే ఈసారి టాలీవుడ్ లో సినిమా కెరీర్ క్లోజ్ అని అంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: