ఒక్క సినిమా స్టార్ హీరో తో చేసి ఆ సినిమా హిట్ అయితే హీరోయిన్ లు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. వరుసగా హిట్ లు వస్తే ఇక వాళ్ళను ఆపే వాడు కూడా ఉండదు అనేది వాస్తవం. టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా మరేది అయినా సరే ఇదే ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఈ మద్య హీరోయిన్ లు కాస్త పొగరు గానే ఉంటున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువ గా వినపడుతున్నాయి. అవకాశం కోసం ప్రయత్నాలు చేసిన రోజు గడ్డం పట్టుకునే హీరోయిన్లు ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడుతున్నారట. 

 

ఇక్కడ పేర్లు ఎందుకు లే గాని ఒక ఇద్దరు హీరోయిన్ల గురించి ప్రస్తావిస్తే, టాలీవుడ్ లో గత ఏడాది కాలంగా వాళ్ళ హవా నడుస్తుంది. వాళ్ళు ఇద్దరూ కూడా స్టార్ హీరోల తో సినిమాలు చేసి హిట్ లు కొట్టేసారు కూడా. దీనితో టాలీవుడ్ దర్శక నిర్మాత లు వాళ్ళ వెంట పడుతూ అవకాశాలు ఇస్తామని తమ సినిమా లో చెయ్యాలని వాళ్ళను కోరుతున్నారు. దీనితో నెత్తికి ఎక్కి కూర్చున్నారు ఆ ఇద్దరు హీరోయిన్లు కూడా. తాము సినిమా చెయ్యాలి అంటే మొన్నటి వరకు అరకోటి చెప్పిన రేటు ని ఇప్పుడు కోట్లకు మార్చేసారు. 

 

త్రివిక్రమ్ తో రెండు సినిమాలు చేసిన హీరోయిన్ అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో తానే స్టార్ అని తనను మించిన వాళ్ళు లేరు అంటూ పలువురి దగ్గర వ్యాఖ్యలు కూడా చేస్తుందని టాక్. తనతో సినిమా చెయ్యాలి అంటే తన రేటు ఇదీ అంటూ చెప్పినట్టు సమాచారం. తాను కొందరికి లక్కీ గర్ల్ అయ్యాను కాబట్టి తాను ఇప్పుడు ఎక్కడా డ్రాప్ అవ్వలేను అని, తన రేటు ఇదీ అంటూ స్పష్టంగా చెప్పడంతో టాలీవుడ్ స్టార్ నిర్మాతలు కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: