హ్యాపీడేస్‌ హీరో నిఖిల్ తనదైన శైలిలో వైవిధ్యమైన చిత్రాలను ఎంపిక చేసుకుని పలు విజయాలను చవిచూశారు.వరస హిట్స్ తో దూసుకుపోతున్న హీరో నిఖిల్‌ బ్రహ్మచారి జీవితానికి స్వస్ది పలక‌నున్నారు. అర్జున్ సురవరం సినిమాతో హిట్ కొట్టిన నిఖిల్.. ఇప్పుడు జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌కు తెర తీస్తున్నాడు. త్వరలోనే ఈయన పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ యంగ్ హీరో నిఖిల్ రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఐదు సంవత్సరాలుగా నిఖిల్ పల్లవి వర్మ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నారు. భీమవరానికి చెందిన పల్లవి వర్మ డాక్టర్ గా పనిచేస్తోంది. తమ ప్రేమను పెద్దలకు చెప్పి వారి అంగీకారంతో ఫిబ్రవరి ఫస్ట్ గోవాలో కేవలం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలోనే నిఖిల్, పల్లవి వర్మల ఎంగేజ్‌మెంట్ జరిగింది. వీరి పెళ్లి ఏప్రిల్ 16న హైదరాబాద్లో ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది. నిఖిల్, పల్లవిల జంట చాలా చూడముచ్చటగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉన్నారు.

 

ఇక టాలీవుడ్ మోస్ట్ బ్యాచ్‌ల‌ర్‌గా పేరుగాంచిన హీరో నితిన్‌.  ప్రభాస్ తో మొదలుపెడితే .. విజయ్ దేవరకొండ దాకా టాలీవుడ్ లో బ్యాచ్ లర్స్ లిస్ట్ చాలా పెద్దదే .. కానీ తాజాగా యంగ్ హీరో నితిన్ త‌న బ్ర‌హ్మ‌చ‌ర్యానికి మంగ‌ళం పాడేశాడు. దాదాపు 8 ఏళ్లుగా ప్రేమిస్తున్న షాలినితో నితిన్ ఎంగేజ్‌మెంట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో అట్ట‌హాసంగా జ‌రిగింది. ప‌సుపు కొట్టే కార్య‌క్ర‌మంతో పెళ్లి హంగామాని మొద‌లుపెట్టేశారు. నితిన్ ఎంబీఏ స్టూడెంట్ షాలిని ప్రేమిస్తున్నాడ‌ని, త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వ‌రుస క‌థ‌నాలు వినిపించిన విష‌యం తెలిసిందే. ఏప్రిల్ 16న దుబాయ్‌లో అత్యంత వైభవంగా డెస్టినేష‌న్ వెడ్డింగ్ త‌ర‌హాలో వీరి వివాహం జ‌ర‌గ‌నుంది. ఇరు కుటుంబాల‌కు చెందిన వాళ్ల‌తో పాటు అత్యంత స‌న్నిహితులు, సినీ సెలబ్రిటీస్ మాత్ర‌మే ఈ వెడ్డింగ్‌లో పాల్గొన‌నున్నార‌ని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: