ఆర్‌.ఆర్‌.ఆర్‌. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం. టాలీవుడ్ టాప్ హీరోలిద్ద‌రూ ఈ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. జూనియ‌ర్ ఎన్టీఆర్, రాంచ‌ర‌ణ్ ఇద్ద‌రూ ఇందులో హీరోలుగా న‌టిస్తున్నారు. డి.ఎ. దాన‌య్య నిర్మిస్తున్న ఈచిత్రం ఎంతో హై బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. అయితే ఈ చిత్రం ఎప్పుడూ ఏదోఒక అప్‌డేట్‌తో జ‌నాల నోళ్ళ‌లో నానుతూ ఉంది.  దీనికి రాజమౌళి దర్శకుడన్నది ఒక కారణమైతే, రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఈ సినిమా చేస్తుండడం మరో కారణం. అయితే ఈ  సినిమా అప్‌డేట్స్ విషయంలో ఆర్.ఆర్.ఆర్ టీమ్ బొత్తిగా స్పందించకపోవడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా వివిధ రకాల ఎంతో యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నారు. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్.. ఇలా వేడుక ఏదైనా హీరోల ఫస్ట్ లుక్స్ కానీ టైటిల్ ఎక్స్‌పెక్టేన్స్‌ కానీ లేదు.

 

అయితే ఈసారి మాత్రం క‌చ్చితంగా అప్‌డేట్  ఉంటుందని చెబుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ టీమ్ కు సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులు చెబుతున్నారు. కానీ రాజ‌మౌళి నుంచి మాత్రం ఎలాంటి అధికార ప్ర‌క‌టన అయితే రాలేదు.  మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ లో అల్లూరి సీతారామరాజు లుక్ లో ఉన్న చరణ్ ఫస్ట్ లుక్ వస్తుందని కొత్త రూమర్స్ మొదలయ్యాయి. అలాగే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో కొమరం భీమ్ లుక్ లో ఉన్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని, ఈ లుక్స్‌ని విడుద‌ల చేస్తూ ప్రమోష‌న్‌ని మొద‌లు పెడ‌తార‌ని తెలుస్తుంది. అయితే నిన్న మెగా ఫ్యాన్స్ మాత్రం ఏదో ఒక ఫొటోని లీక్ చేశారు. అల్లూరి సీతారామ‌రాజు  స్టిల్‌ని ఒక‌టి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి హంగామా చేశారు.కానీ అది చిత్ర యూనిట్ నుంచి వ‌చ్చిన ఫొటో అయితే కాదు. ఇప్ప‌టి వ‌ర‌కు అన్నీ లీక్‌లు త‌ప్పించి ప్ర‌త్యేకంగా చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: