ఆదివారం అనగానే చాలా మంది సినిమాకే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సండే ని సినిమాతో ఎంజాయ్ చెయ్యాలి అనేది చాలా మంది ఎంచుకునే బెస్ట్ ఆప్షన్. మరి ఏ సినిమా చూడాలి అనేది ఒక సందేహం. వారం అంతా కస్టపడి వీకెండ్ లో సినిమాకు వెళ్తే ఆ సంతోషమే వేరు కదా... మరి ఏ సినిమా చూడాలి...? ఏ సినిమా అయితే మనకు వినోదం దొరుకుతుంది...? దీనికి రకరకాల వెబ్ సైట్స్ చూసి తెలుసుకోవడమో లేక ఫ్రెండ్స్ ని అడగడమో చేస్తూ ఉంటారు. అందుకే మీ కోసం మేము బెస్ట్ సినిమా ఏదో సజెస్ట్ చేస్తున్నాం. 

 

ప్రస్తుతం వినపడుతున్న టాక్ ప్రకారం చూస్తే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా ఫస్ట్ ఆప్షన్ అంటున్నారు. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు దాదాపు అన్ని చోట్లా ఆడుతుంది. వినోదానికి కూడా కొదవలేదు. సంక్రాంతి తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా దీన్ని బీట్ చేయలేదు. 

 

సరిలేరు నీకెవ్వరు... ఈ సినిమా హడావుడి గాని అంత లేదు అనేది కొందరి టాక్. కాబట్టి ఈ సినిమా అసలు చూడకపోతే చూడవచ్చు గాను బెస్ట్ ఆప్షన్ మాత్రం కాదని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను జానూ రిప్లేస్ చేసింది. 

సినిమా మిశ్రమ టాక్ తో దూసుకుపోతుంది. లవర్స్ కి ఈ సినిమా బాగుంటుంది అని చెప్తున్నారు. కాబట్టి లవ్ స్టొరీ ఫీల్ అయ్యే వాళ్ళు ఈ సినిమాను ఆప్షన్ గా ఎంచుకోవచ్చు.

 

 

వరల్డ్ ఫేమస్ లవర్... శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఏకంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. 

 

డిస్కో రాజా... సంక్రాంతి తర్వాత వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు కాబట్టి లాస్ట్ ఆప్షన్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: