యండమూరి వీరేంద్రనాథ్ ను ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయవలసిన అవసరం లేదు. నాటక రచయితగా తన రచనా వ్యాసంగం మొదలు పెట్టి ఆ తరువాత నవలా రచయితగా మారి ఆపై దర్శకుడుగా అవతారం ఎత్తి ప్రస్తుతంవ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మారిన యండమూరి ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసాడు.


తనకు తెలిసిన ఒక స్నేహితుడి కొడుకు విపరీతంగా మద్యానికి బానిస అయిపోతే అతడిని దేశంలోని అనేక కౌన్సిలింగ్ కేంద్రాల చుట్టూ తిప్పి ఆ రోజులలో 20 లక్షలు ఖర్చు పెట్టినా ఆ వ్యక్తికి పోని తాగుడు వ్యసనం తాను చేసిన ఒక చిన్న ట్రిక్ తో తాగుడు మానేసిన ఆసక్తికర విషయాన్ని షేర్ చేసాడు. తన స్నేహితుడి కొడుకుకు సినిమాలలో నటించడం అంటే పిచ్చ అన్న విషయం గ్రహించి తాను అతడితో సినిమా తీస్తానని అయితే హీరో అవ్వాలి అంటే సెట్స్ పై తాగి ఉండకూడదు కాబట్టి తాగుడు మానమని చెప్పడంతో సినిమా హీరో అవ్వాలనే పట్టుదలతో ఆ వ్యక్తి తన తాగుడు వ్యసనాన్ని మానుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.


ఆ తరువాత అదే వ్యక్తిని హీరోగా చేసి తాను ‘దుప్పట్లో మిన్నాగు’ అన్న మూవీని తీసానని ఆ సినిమా వల్ల ఆ మూవీ తీసిన తన స్నేహితుడుకి 80 లక్షలు పోయినా తన కొడుకు తాగుడు వ్యసనం పోయినందుకు ఇప్పటికీ ఆనంద పడుతున్నాడు అంటూ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. ‘స్టువర్ట్ పురం పోలీసు స్టేషన్’ భయంకరమైన ఫ్లాప్ కావడంతో తాను నిరాశలోకి వెళ్లిపోయి ఏమి చేయాలో తెలియక రోజు పేకాట ఆడుతూ దారుణమైన పరిస్థితులలోకి వెళ్ళిపోయిన తనను మానసిక వికాస నిపుణుడు పట్టాభిరాం తన వ్యసనాన్ని మార్చడమే కాకుండా తనను వ్యక్తిత్వ వికాస నిపుణుడు గా మారమని సలహా ఇవ్వడంతో ఇప్పుడు తాను నిరంతర ధ్యాయంతో వ్యక్తిత్వ వికాస నిపుణుడుగా రోజుకు లక్షల రూపాయల పారితోషికాన్ని తన ఉపన్యాసాలకు తీసుకుంటున్న విషయాన్ని వివరించాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: