యూత్ క్రేజీ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ న‌టించిన తాజా `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` ఈ చిత్రం విడుద‌ల‌కి ముంది తెగ ప్రయోష‌న్స్‌తో క్ష‌ణం తీరిక లేకుండా హోరెత్తించింది. అయితే నిన్న విడుద‌లైన ఈ చిత్రం ఆశించినంత హిట్ అయితే కాలేదు. డివైడ్ టాక్‌తో కొంచం ఏదో ప‌ర్వాలేద‌నిపించుకుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో విజ‌య్‌దేవ‌ర‌కొండ సినిమాలు పెద్ద‌గా హిట్ కావ‌డంలేదు. ఆఖ‌రికి ఆయ‌న ఇటీవ‌లె ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన చిత్రం `మీకుమాత్ర‌మే చెప్తా` సినిమా కూడా ఫ్లాప్ అయింది. అయితే ఈ వ‌ర‌ల్డ్‌ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్ర‌ భారాన్ని హీరోయిన్స్‌తో పాటు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కి వ‌దిలేసి త‌న కొత్త సినిమా షూటింగ్ వెళ్లిపోయాడు.

 

 పూరిజ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో విజ‌య్ దేవ‌రకొండ `ఫైట‌ర్‌` సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ డ్రీమ్‌ని నిజం చేసుకుంటున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమాని తెర‌పైకి తీసుకొస్తున్నారు. మ‌రి ఈ చిత్ర‌మైన  త‌న‌కి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. దేశ వ్యాప్తంగా మార్కెట్ కోసం రాజ‌మౌళి `బాహుబ‌లి`కి క‌ర‌ణ్ జొహార్‌ని దింపిన‌ట్టు పూరి కూడా అత‌న్నే ప‌ట్టుకున్నాడు. ఈ సినిమాకు క‌ర‌ణ్‌జొహార్ స‌మ‌ర్ప‌కుడిగా వ్యవ‌హ‌రిస్తున్న విష‌యం తోలిసిందే. 


ఇటీవ‌లే ముంబైలో మొద‌లైన ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్త‌యింది. `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` రిలీజ్ ప్ర‌మోష‌న్స్ కోసం బ్రేకిచ్చిన రౌడీ శ‌నివారం `ఫైట‌ర్‌` సెట్‌లో వాలిపోయాడు. ఈ సినిమా కోసం మాసీవ్ రింగ్ ఫైట్స్‌ని పూరి ప్లాన్ చేశాడు. వాటిని ఆర్ట్ డైరెక్ట‌ర్ జాన్ రూపొందించార‌ట‌. సెట్‌లో శ‌నివారం అత‌ని పుట్టిన రోజుని చిత్ర బృందం సెల‌బ్రేట్ చేసి తాజా అప్‌డేట్‌ని వెల్ల‌డించింది. మ‌రి ఇక వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ ప‌ని అయిపోయిన‌ట్టేనా.. విజ‌య్ దానికి ఫుల్‌స్టాప్ పెట్టేశాడ‌న‌మాట‌. ఇక ఫైట‌ర్ తో ఫైట్ మొద‌లెట్టాడ‌న‌మాట‌. మ‌రి క‌నీసం ఈ చ‌త్ర‌మైన త‌న‌కి మంచి ఫ‌లితాన్నిస్తే బావుంటుంది లేదంటే ఈ చ‌త్రం ఏమ‌న్నా కాస్త అటూఇటూ అయినా విజ‌య్‌పైన నిర్మాత‌ల‌కి న‌మ్మ‌కం కుద‌ర‌డం కాస్త క‌ష్ట‌మే. 

మరింత సమాచారం తెలుసుకోండి: