ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చాలా గ్యాప్ త‌ర్వాత సినిమా చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న ఒకేసారి రెండు సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఒక‌టి పింక్ రీమేక్ చిత్ర‌మ‌యితే.. మ‌రొక‌టి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రం షూటింగ్ గురించి ఒక విష‌యం తెల‌సుకుందాం...


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ షూటింగ్‌కు వ‌స్తే చాలు యూనిట్ పండుగ చేసుకుంటున్నార‌ట‌. ఎందుకంటే. ఓ ప‌క్క  సినిమా షూటింగ్‌లో బిజీగా వుంటూనే మ‌రో ప‌క్క రాజ‌కీయాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు ప‌వ‌న్‌.  అయిన్ ప‌వ‌న్‌.. ఒక‌రోజులో గంట‌, రెండు గంట‌ల‌క‌న్నా ఎక్కువ స‌మ‌యం షూటింగ్‌లో ఉండ‌డంలేద‌ట‌. ఆయ‌న కోసం కో ఆర్టిస్టులు, 24క్రాఫ్ట్స్‌ వారు అంతా సిద్ధంగా ఈయ‌న కోసం వెయిట్ చేస్తున్నార‌ట‌. అంటే...ఉద‌యం 7గంట‌ల‌కు షాట్‌లో వుంటే...  అప్ప‌టి నుంచి ప‌వ‌న్ రాక‌కోసం ద‌ర్శ‌కుడు ఎదురుచూపులే. ఆఖ‌రికి మ‌ధ్యాహ్నం లంచ్ టైంకు అటూ ఇటూగా వ‌స్తాడ‌ట‌. రాగానే ఆయ‌న పై షాట్ తీయ‌డం మొద‌లు పెడితే... కొద్దిసేప‌టికే ఒక‌టి రెండు షాట్స్‌ అవ్వ‌గానే... వెంట‌నే వెళ్ళిపోతాడు. 

 

ఇటీవ‌లే హైద‌రాబాద్ శివార్ల‌లో ఇలాంటి స‌న్నివేశం ఒక‌టి జ‌రిగింది.  ఒక స‌న్నివేశం చేయ‌క‌గానే.. న‌డ‌చుకుంటూ వెళుతున్నాడు అని అంద‌రూ అనుకుంటున్నారు. ఆయ‌న వెంట బాడీగార్డ్ కూడా వెళుతున్నారు. ఈ లొకేష‌న్ బాగుందంటూ న‌డ‌చుకుంటూకొద్ది దూరం వెళ్ళాడు.వెంట‌నే ఆయ‌న వెన‌కే కారు ఫాలో అయింది. వెంట‌నే కారు ఎక్కి వెళ్ళిపోయాడు. అంటే అక్క‌డ ఎవ్వ‌రూ ఎక్స్‌పెక్ట్ చేయ‌లేదు అన్న మాట‌.  స‌ద‌రు ద‌ర్శ‌కుడికి ఏమి అర్ధం కాలేదు. ప‌వ‌న్ గురించి తెలిసిన వార‌కి మాత్ర‌మే అర్థ‌మై... సార్‌.. ఇంతే.. ఎప్పుడూ ఫుల్ షూటింగ్ వ‌ర‌కు వుండ‌డ‌ని ద‌ర్శ‌కుడు విన్న‌న‌వించార‌ట‌. గంట‌రెండు గంట‌ల కోసం ఎంతో మంది వెయిట్ చేయ‌డం.. వారికి పేమెంట్లు ఇవ్వ‌డం.. అనేది నిర్మాత‌కు ఇదంతా మామూలేన‌ని ద‌ర్శ‌కుడితో గుసగుస‌లాడారు. ఈ చిత్రంలో మిగిలిన షాట్స్‌ తీయాలంటే.. వ‌ప‌న్ లేకుండా వున్న సీను జాగ్ర‌త్త‌గా తీసుకుంటూ కాలం గ‌డిపేస్తున్నారు.  ప్ర‌స్తుతం ప‌వ‌న్ రాజ‌కీయ మీటింగ్‌లో బిజీగా వున్నాడు. ఇటీవ‌లె రాజ‌ధాని రైతుల‌ను క‌లిసి వారి ఉద్య‌మానికి అండ‌గా నిలుస్తాన‌ని మాట ఇచ్చారు ప‌వ‌న్‌.  ఇంకా మొత్తం మూడు చిత్రాల‌లో ప‌వ‌న్ క‌మిట్ అయ్యాడు. మిగిలిన ద‌ర్శ‌క నిర్మాత‌ల ప‌రిస్థితి ఏం చేస్తాడో ఏంటో మ‌రి మ‌న ప‌వ‌న్‌. ఇక ఇలా వ‌చ్చి వెళ్ళ‌డం పై కొంత మంది గోపాలా గోపాలా చిత్రంలో ప‌వ‌న్ అలాగే దేవుడిలా మ‌ధ్య‌మ‌ధ్య‌లో వ‌చ్చి వెళ్ళ‌డాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: