ఇండియాలో దాదాపు అన్ని భాషల్లోనూ సూపర్‌ హిట్ అయిన టెలివిజన్‌ సిరీస్‌ బిగ్‌ బాస్‌. ఇటీవల ముగిసిన తెలుగు బిగ్‌ బాస్‌లో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ విజయం సాధించగా, తాజాగా ముగిసిన హిందీ బిగ్ బాస్‌ 13లో సిద్దార్థ్‌ శుక్లా విజయం సాధించాడు. సిద్ధార్థ్‌కు అభిమానులతో పాటు పలు టెలివిజన్‌, సినిమా సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

అయితే బిగ్ బాస్‌ 11 విజేత శిల్పా షిండే మాత్రం సిద్ధర్థ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను గతంలో సిద్ధార్థ్‌తో డేటింగ్ చేశానన్న శిల్పా అతను తనను కొట్టేవాడని ఆరోపించింది. స్పాట్‌ బాయ్‌ అనే వెబ్‌ సైట్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన శిల్పా సంచలన వ్యాఖ్యలు చేసింది. `అవును నాకు గతంలో సిద్ధర్థ్‌ శుక్లాతో ఎఫైర్‌ ఉంది. అతను చాలా దారుణంగా మాట్లాడతాడు. చాలా కోపిస్టి. నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. కొట్టేవాడు కూడా.

 

విన్నర్‌గా సిద్ధర్థ్‌ను ప్రకటించడానికి ముందుకు కూడా ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. అందరూ భావిస్తున్నట్టుగా సిద్ధర్థ్‌ ఈ టైటిల్ గెలవకూడదూ అంటూ ఆమె కామెంట్ చేసింది. అప్పట్లో ఆ వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. `నేనే నిజంగా ఇది జరగకూడదని కోరుకుంటున్నా. సిద్దార్థ్‌ లాంటి వ్యక్తి ఈ షో గెలవకూడాదు. అలా అయితే షో డిజాస్టర్‌ అయినట్టే. అతను ఆ టైటిల్‌కు అర్హుడు కాదు` అంటూ శిల్పా కామెంట్ చేసింది.

 

అయితే అనూహ్యంగా సిద్ధార్థే టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. హౌస్‌లో సిద్ధార్థ్‌ షెహనాజ్‌తో నడిపిన ప్రేమాయణం కూడా అతన్ని వార్తల్లో నిలిచేలా చేసింది. దాదాపు 5 నెలల పాటు బిగ్‌ బాస్‌ హౌస్‌లో గడిపిన సిద్దార్థ్‌ శుక్లాను విజేతగా ప్రకటించారు. చివరి వరకు గట్టి పోటి ఇచ్చిన మోడల్‌ అసిమ్‌ రియాజ్‌ రన్నరప్‌గా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: