టాలీవుడ్ లో ఎప్పుడూ హీరోయిన్స్ కొరత ఉంటుంది. ముంబై నుండి వచ్చిన భామలకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఈమధ్య తమిళ, మళయాళ, కన్నడ భామలు టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న పూజా హెగ్దె బాలీవుడ్ నుండి రాగా.. రష్మిక మాత్రం కన్నడ నుండి వచ్చింది. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకున్న పూజా హెగ్దె అల్లు అర్జున్ డీజే తర్వాత ఫేట్ మారిపోయింది. ఇక అప్పటి నుండి వరుస స్టార్ అవకాశాలతో కెరియర్ సూపర్ స్వింగ్ లో నడిపిస్తుంది.  

 

ఈమధ్యనే అల్లు అర్జున్ తో నటించిన అల వైకుంఠపురములో సినిమాతో నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత పూజా హెగ్దె ప్రభాస్ జాన్ మూవీలో నటిస్తుంది. దీనితో పాటుగా అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో కూడా అమ్మడు నటిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మిస్తున్నారు. స్టార్ అవ్వకముందు అన్న నాగ చైతన్యతో నటించిన పూజా హెగ్దె ఇప్పుడు స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాక అఖిల్ తో నటిస్తుంది.

 

అఖిల్ నుండి మిస్టర్ మజ్ ను వరకు వరుస మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో అఖిల్ బ్యాచ్ లర్ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు పూజా హెగ్దే కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం కెరియర్ పీక్స్ లో ఉన్న పూజా హెగ్దే అఖిల్ కు ఏ విధంగా ప్లస్ అవుతుందో చూడాలి. ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో షూస్ తో ఎదో హింట్ ఇస్తున్నాడు భాస్కర్. మరి టీజర్ వస్తేనే కాని అసలు కథ ఏంటి అన్నది తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: