అనుపమా పరమేశ్వరన్... ప్రస్తుతం ఆదరణ కోల్పోయిన హీరోయిన్. కెరీర్ మొదట్లో సోషల్ మీడియా సహా ప్రధాన మీడియాలో ఎక్కువగా హడావుడి చేసిన ఈ కేరళ అమ్మాయి ఇప్పుడు అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంది. అసలు దీనికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియకపోయినా... ఆమె మాత్రం అవకాశాలు లేక కాస్త కష్టపడుతుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఈమె సినిమాల్లోకి అడుగుపెట్టిన సమయంలో సౌందర్య అవుతుంది అని భావించారు. కాని ఆ తర్వాత ఏమైందో ఏమో ఒక్కసారిగా సినిమాలకు దూరమైపోయింది అనుపమా. 

 

ఇప్పుడు ఆమె చేతిలో కేవలం ఉన్నదీ ఒక్క సినిమా. ఇటు తెలుగులో కూడా ఆమెతో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకి రావడం లేదు. దానికి కారణం ఏంటీ అని అడిగితే కొంత మంది సినీ పరిశీలకులు మాత్రం... హీరోల పక్కన ఆమె సరిపోవడం లేదని అంటున్నారు. చిన్న పిల్లలా కనపడుతుందని అంటున్నారు. అందుకే చాలా మంది దర్శకులు ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదని టాక్ వినపడుతుంది. రామ్, శర్వానంద్ పక్కన చేసిన సినిమాల్లో ఆమె మరీ పది చదివే అమ్మాయి మాదిరిగా ఉందని కామెంట్స్ వచ్చాయి. 

 

దీనికి తోడు నటన లో కూడా ఆమె పెద్దగా రాణించడం లేదని దర్శకులు భావిస్తున్నారు. దీనితోనే అనుపమా కు అవకాశాలు రావడం లేదు అనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతుంది. అవకాశాల కోసం ఆమె ప్రస్తుతం కేరళలోనే ప్రయత్నాలు చేస్తుందని.. ఎవరైనా వచ్చి అడిగితే సినిమాలు చెయ్యాలి అనుకుంటుంది గాని తనకు తాను గా ఎవరిని వెళ్లి అవకాశం కావాలి అని గాని మరొకటి గాని ఆమె అడగడం లేదని టాక్. కొంత మంది అయితే అనుపమా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఆమె కెరీర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: