జాన్వీ కపూర్... ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువగా వినపడుతున్న పేరు. సోషల్ మీడియాలో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలు చేయడమే కాదు తన ఫ్యాషన్ తో విశేషంగా ఆకట్టుకుంటుంది. పొట్టి దుస్తులు వేసుకుంటూ సోషల్ మీడియాలో ఎక్కువగా ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది ఈ భామ. ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు చేస్తుంది ఈ అమ్మాయి. త్వరలోనే మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్దంగా ఉంది. అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు ఈ అమ్మాయికి తన తండ్రి బోనీ కపూర్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచార౦. 

 

అది ఏంటీ అనేది చూస్తే, ఈ మధ్య సోషల్ మీడియాలో పొట్టి దుస్తులతో ఈ అమ్మాయి ఎక్కువగా ట్రోల్ అవుతుంది. దీనికి కారణం ఆమె ప్రవర్తన సహా వేసుకునే దుస్తులే. అవి మరీ అసభ్యంగా ఉంటున్నాయని, తన తండ్రికి తల్లికి ఉన్న ఇమేజ్ తో ఆమెకు అవకాశాలు రావడం పెద్ద కష్టం కాదని, కాబట్టి ఇలా ప్రవర్తించడం మానుకోవాలి అని పలువురు సోషల్ మీడియాలో సూచిస్తున్నారు. అక్కడి దర్శక నిర్మాతలు కూడా ఆమెకు ఇదే విషయాన్ని చెప్పినట్టు సమాచారం. ఒక సినిమా షూటింగ్ లో ప్రత్యేకంగా ఒక దర్శకుడు చెప్పాడట. 

 

చాలా కెరీర్ ఉందని, ఇప్పుడే ఇలా చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉందని పదే పదే చెప్పినా సరే ఆమె వినలేదట. దీనితో ఆమె తండ్రి బోనీ కపూర్ కి ఆ దర్శకుడు చెప్పడంతో బోనీ ఆమెను క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. మళ్ళీ ఇలాంటి విషయాలు తన వద్దకు రావొద్దని, ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రం సినిమాలకు దూరం చేస్తా అని చెప్పారట. జిమ్ కి వెళ్ళడానికి కూడా అంత సీన్ అవసరం లేదని, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని సూచించారట. త్వరలోనే ఈ రిమార్క్ నుంచి బయటకు రావాలని చెప్పారట బోని.

మరింత సమాచారం తెలుసుకోండి: