టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఆయన నటించిన గత రెండు సినిమాలైన నా పేరు సూర్య, డీజే పెద్దగా సక్సెస్ కాకపోవడంతో, ఆయన ఫ్యాన్స్ ని ఎంతో నిరాశ చెందారు. ఎట్టకేలకు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల సినిమా మంచి హిట్ కొట్టి, కెరీర్ పరంగా బన్నీకి మంచి బ్రేక్ ని ఇచ్చింది. ఇక ప్రస్తుతం వెరైటీ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న బన్నీ, ఎలాగైనా ఈ సినిమాతో కూడా మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. 

 

గతంలో బన్నీ, సుకుమార్ కాంబో లో వచ్చిన ఆర్య సినిమా మంచి హిట్ కొట్టగా, ఆర్య 2 మాత్రం ఫెయిల్ అయింది. ఇక ప్రస్తుతం ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూడవ సినిమాతో ఎలాగైనా ఇద్దరూ హిట్ కొడతారని టాలీవుడ్ వర్గాల టాక్. ఇకపోతే గంధపు చెక్కల బ్యాక్ డ్రాప్ లో మంచి మాస్, యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. 

 

ఇక ఈ సినిమా కోసం బన్నీ బాగా రఫ్ లుక్ లో కనపడడంతో పాటు, ఎంతో గుబురుగా గడ్డాన్ని కూడా పెంచుతున్నాడు. గంధపు చెక్కలు నరికే ఒక మాస్ యువకుడిగా బన్నీ నటిస్తుంటే, అదేవిధమైన మాస్ పాత్రలో హీరోయిన్ రష్మిక నటిస్తోందట. అయితే పాత్రల్లో సహజత్వం మిస్ కాకూడదని భావించిన దర్శకుడు సుకుమార్, బన్నీ లుక్ ని ఎంతో రఫ్ గా ఉండేలా ప్లాన్ చేసాడట. అంతేకాక ఈ సినిమాలో బన్నీ కొన్ని యాక్షన్ సీన్స్ లో ఏ మాత్రం డూప్ లేకుండా నటిస్తున్నట్లు చెప్తున్నారు. మొత్తంగా ఎంతో జాగ్రతగా, పకడ్బందీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా హిట్ అయితే బన్నీ లక్కు తోక తొక్కినట్లే మరి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: