పెళ్లి అయినా సరే వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది అక్కినేని వారి కోడలు సమంతా. వరుస ఆఫర్లు ఆమెను వరిస్తున్నాయి. ఆ సినిమాసినిమా అనే తేడా లేకుండా సమంతా ఇంకా స్టార్ హీరోయిన్ గానే ఉంది. దాదాపు పదేళ్ళ క్రితం టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆమెకు ఆఫర్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. సాధారణంగా పెళ్లి అయితే హీరోయిన్లు వెనక్కు తగ్గడం మనం చూస్తున్నాం. కాని సమంతా విషయంలో మాత్రం అలా లేదనే చెప్పాలి. ఇప్పుడు ఆమె చేసే సినిమాలు అన్నీ హిట్స్ గానే ఉన్నాయి. 

 

భర్త నుంచి ప్రోత్సాహం ఉన్న నేపధ్యంలో వచ్చిన అవకాశాలను వాడుకోవాలని భావిస్తుంది. అటు అక్కినేని కుటుంబం కూడా ఈ విషయంలో ఎక్కడా అభ్యంతరం చెప్పడం లేదని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆమెను సినిమాలకు దూరంగా ఉండమని నాగచైతన్య చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆమె నటించిన జాను సినిమా మిశ్రమ టాక్ తో దూసుకుపోతుంది. ఇక మరో రెండు మూడు సినిమాలు చేస్తుంది ఆ అమ్మాయి. ఇక సినిమాలకు దూరంగా ఉండాలని, ఇప్పట్లో సినిమాలు వద్దని చెప్తున్నాడట. 

 

దీనితో సామంత ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి త్వరలో తప్పుకునే ఆలోచనలో ఉందని అంటున్నారు. ఏమైనా ఆఫర్లు వస్తే చైతూ తో చర్చించి అప్పుడు ఓకే చెప్తుంది అని టాక్ వినపడుతుంది. ఆమె కు చెయ్యాలని ఉన్నా సరే కుటుంబం మాత్రం అభ్యంతరం తెలపడంతో సమంతా ఇంకా చాలని, ఇప్పటికే తన భర్త నుంచి తనకు మంచి ప్రోత్సాహం వచ్చిందని సినిమాలకు దూరంగా ఉంటాను అని సన్నిహితులతో కూడా చెప్తుందని టాక్. అయితే ఇక్కడ మరో గాసిప్ కూడా వినపడుతుంది. వాళ్ళు పిల్లల్ని ప్లాన్ చేస్తున్నారని అందుకే సినిమాలు వద్దని భావిస్తున్నారు అనే టాక్ కూడా వినపడుతుంది. కొంత మంది అయితే సమంతా ప్రెగ్నెంట్ అని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: