టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమాలంటే జనాలు వెర్రెత్తి పోతారు. బద్రి, ఇడియట్, పోకిరి, బిజినెస్ మ్యాన్ ..ఇలా వెరైటీ టైటిల్స్ తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ ని తెరకెక్కించడం పూరీకే సాధ్యం. ఆ దమ్ము ధైర్యం ఉన్న ఏకైక టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాత్రమే. ఇక ఆయన సినిమాలలో హీరోలు రఫ్ అండ్ ఠఫ్ గా ఉంటారు. యారగెంట్ గా ఇరగదీసేస్తుంటారు. పూరి సినిమాలో హీరో ఎవరైనా స్టైల్ మాత్రం పూరీదే కనిపిస్తుంటుంది. డైలాగ్ డెలవరీ, బాడీ లాంగ్వేజ్, యారగంట్ యాటిట్యూడ్ మొత్తం జనాలకి బుల్లెట్ లా పాయింట్ బ్లాంక్ లో దిగిపోవాల్సిందే. 

 

ఇక పూరి హీరోయిన్ ని వాడినంతగా మరే డైరెక్టర్ వాడడు. కథలో హీరో కి సమానంగా హీరోయిన్ క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ ఉండాల్సిందే. ఇప్పటి వరకు ఆయన తీసిన ఏ సినిమాలో కూడా హీరోయిన్ అనవసరం..కేవలం పాటలకే తీసుకున్నాడు ...హీరోయిన్ డమ్మీ ..ఇలాంటి మాటలు పూరీ సినిమాలో ఉన్న హీరోయిన్స్ గురించి వినిపించవు. అయితే పూరీ డైరెక్టర్ గా మాంచి సక్సస్ లో ఉండగానే నిర్మాతగా మారడు. వైష్ణో అకాడమీ నిర్మాణ సంస్థని స్థాపించి ఇడియట్ నుంచి వరుసగా కొన్ని సినిమాలని నిర్మించారు పూరి.

 

టాలీవుడ్ లో ఒక దర్శక, నిర్మాత సంపాదించనంత డబ్బు పేరు సంపాదించారు. అది అతి కొద్దికాలంలోనే. కానీ పేరు పదిలంగా ఉన్నప్పటికి సంపాదన మాత్రం నమ్మకం తినేసింది. ఆ నమ్మకమే పూరి నమ్మిన స్నేహితుడు. అదే సమయంలో వరుసగా ఫ్లాపులు పడ్డాయి. దాంతో పూరీ ఆస్తులన్ని పోగొట్టుకున్నాడు. దిక్కు తోచని పరిస్థితి. కానీ అమితాబ్ తో తీసిన బాలీవుడ్ సినిమా బుడ్డా సూపర్ హిట్ అయింది. మళ్ళీ ఫాం లోకి వచ్చారు పూరి. ఈసారి పేరుతో పాటు డబ్బుని పదిల పరుచుకున్నారు. అయితే దర్శకుడిగా , రచయితగా కంటే నిర్మాతగానే జీవితం చలగాటంలా ఉంటుంది అంటారు పూరి. ఇది ఆయన జీవితం నేర్పినపాఠం. అంతేకాదు నిర్మాతగా మారితే రోజు నిద్ర మాత్రలు వేసుకోవాల్సిందేనని నిర్మాతలకి ఉంటే టెన్షన్స్ ని బయట పెట్టారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: