హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఏ స్టార్స్ యాకటర్స్ అయినా కూడా సినిమాలో బయట చూడటానికి పెద్దగా తెడా కనిపించదు. కానీ అదే సౌత్ సినిమాలలో చూస్తే షాకవ్వాల్సిందే. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ..ఇలా సౌత్ లో సినిమా తారలని చూస్తే మేకప్ లో అందంగా అద్భుతంగా ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయం తీసుకుంటే చాలామంది హీరోయిన్స్ ని తెరమీద చూసి మనసు పారేసుకుంటారు. ఆ హీరోయినే తమ కలల రాణి .. రాకుమారి అంటూ కవిత్వాలు రాసుకుంటారు, కావాలంటే కలల్లో ఒక పాటేసుకుంటారు. నిజంగా చెప్పాలంటే చాలా మంది అబ్బాయిలు చేసేది ఇదే. ఇక వాళ్ళ కోసం బర్త్ డే లని సెలబ్రెట్ చేయడం అనాధలకి దానాలు చేయడమూ చాలా చూశాము. ఇదంతా తమ అభిమాన నాయకా నాయకీలకొసమే చేస్తారు.

 

ఇక తన డ్రీం గర్ల్ గనక ఏదైనా పబ్లిక్ ఫంక్షన్ కి అంటే ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసమో, మరేదైనా కొత్త సినిమా రిలీజైనప్పుడు థియోటర్స్ విజిట్ కో వస్తే ఇక జనాలౌ చేసే హంగామా ఏ రేంజ్ లో ఉంటుదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో అంటే ఫేస్ బుక్, ఇన్స్టా గ్రాం, ట్విట్టర్ లో తమ హీరో హీరోయిన్స్ ని ఫాలో అయ్యో ఫాలోవర్స్ లక్షల్లో ఉంటారన్న్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్స్ ఎప్పటికప్పుడు రక రకాల ఫొటో సూట్స్ చేసి ఆ ఫొటోలని తమ అకౌంట్ లో పోస్ట్ చేసిన క్షణాల్లోనే లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు పడతాయి. ఐ లవ్ యూ డియర్, సూపర్ సెక్సీ, హాట్ బ్యూటీ, విల్ యు మ్యారీ మీ అంటూ ఎన్నో రకాల కామెంట్స్ తో హీరోయిన్స్ కామెంట్ బాక్స్ నిండిపోతుంది.

 

అయితే అదంతా హీరోయిన్స్ మేకప్ లో చూసి మాత్రమే. ప్రతీ సినిమాకో మేకోవర్, ప్రతీ ఫోటో షూట్ కి ఒక కొత్త స్టైల్ ..ఇలా ఆధ్యంతం అలరించే గ్లామర్ మేకప్ చాటునే. అదే మేకప్ తీసేస్తే అసలు ఈమే పలానా హీరోయిన్ ఆ అని గుర్తు పట్టడం చాలా కష్టం. ఇదే విషయం చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. మేకప్ లో అందంగా ఉన్న హీరోయిన్స్ ని స్క్రీన్ మీద చూసిన వాళ్ళు ఏయిర్ పోర్ట్ లోనో మరెక్కడో జానల పక్కన కూర్చున్నా కూడా గుర్తు పట్టరు. అదే హీరోయిన్స్ కి కొన్ని సార్లు షాకింగా కూడా ఉంటుంది. ఇదే ప్రశ్న మీడియాలో ఎదురైనప్పుడు కూడా మన హాట్ హీరోయిన్స్ ఇచ్చే సమధానం కాస్త షాకింగ్ గానే ఉంటుంది. 

 

అదేంటంటే మేము మేకప్ లో ఉంటేనే మమ్మలిని గుర్తు పడతారు. లేదంటే పక్కన కూర్చున్న పట్టించుకోరు. ఏదో కొత్త మొహాన్ని చూసినట్టు చూస్తారు. ఒకవేళ నేను పలానా హీరోయిన్ అని చెప్పినా చీ చీ నువ్వు హీరోయిన్ ఏంటి అంటూ చాలా దారుణంగా అసహించుకుంటారు. మేకప్ లేకపోతే మా బతుకులు అలా ఉంటాయి అంటూ కొందరూ ఫీలయిన సందర్భాలూ చాలా ఉన్నాయి. పాపం హీరోయిన్స్ కి ఇలాంటి అనుభవాలు ఎక్కువగా జరగడం సహజమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: