కొన్నేళ్ళ క్రితం అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా చక్రం తిప్పిన స్టార్ హీరోయిన్ రాధా. ముందుగా 1981లో శోభన్ బాబు హీరోగా తెరకెక్కిన ప్రేమ మూర్తులు అనే సినిమాతో తెలుగుకు నటి గా పరిచయం అయిన రాధా, ఆ తరువాత గోపాల కృష్ణుడు, చండ శాసనుడు, మిస్టర్ విజయ్, గుండా వంటి సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకుంది. వాటిలో కొన్ని సినిమాలు మంచి విజయం సాధించి ఆమెకు హీరోయిన్ గా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా తన అందం, అభినయంతో అవకాశాలు అందుకున్న రాధా, ఆపై అప్పటి టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించింది. 

 

ఇక సినిమా రంగంలోకి ప్రవేశించిన తరువాత వివాహం చేసుకున్న రాధా, ఆ తరువాత 1991 అనంతరం మెల్లగా సినిమాలు తగ్గించారు. ఇక ఇటీవల 2009లో ఆమె పెద్ద కుమార్తె కార్తీక, అక్కినేని నాగ చైతన్య డెబ్యూ మూవీ అయిన జోష్ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే అప్పట్లో ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. ఆ తరువాత అక్కడక్కడా తెలుగు, తమిళ సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు పెద్దగా పేరు రాలేదు. అయితే జీవ హీరోగా వచ్చిన రంగం సినిమా హిట్ కొట్టినప్పటికీ, అది ఆమె కెరీర్ కు ఏ మాత్రం హెల్ప్ చేయలేకపోయింది. అక్కడి నుండి ఆమెకు అవకాశాలు లేవు. ఇక 2013లో కాదల్, తెలుగులో కడలి పేరుతో కార్తీక సోదరి తులసి సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది. 

 

మణిరత్నం దర్శకత్వం వహించిన ఆ సినిమా ఫ్లాప్ అయింది. అనంతరం తమిళ్ లో యాన్ అనే మరొక సినిమాలో మాత్రమే నటించిన తులసి కి కూడా ప్రస్తుతం సినిమా అవకాశాలు లేవు. అయితే కూతుళ్ళిద్దరి భవిష్యత్తు కోసం రాధ ఎంతో తపన పడ్డారని, అయితే ఊహించని విధంగా ఇద్దరూ కూడా కెరీర్ పరంగా సక్సెస్ కాకపోవడంతో ఆమె ఒకింత మనోవేదన అనుభవిస్తున్నారని కోలీవుడ్ వర్గాల్లో కొన్నాళ్ల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. తల్లి స్టార్ హీరోయిన్ అయినా, పాపం కూతుళ్ళని మాత్రం హీరోయిన్స్ గా రాధా నిలబెట్టలేకపోయింది అంటూ ఆమెపై తమిళ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా జాలి చూపిస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: