టాలీవుడ్ సీనియర్ నటులు సూపర్ స్టార్ కృష్ణ, తేనెమనసులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తొలి సినిమాతో మంచి పేరు సంపాదించిన కృష్ణ, ఆ తరువాత వరుసగా అవకాశాలు అందుకున్నారు. ఇక అక్కడి నుండి వస్తున్న అవకాశాల్లో చాలావరకు మంచి సక్సెస్ లు గా మలచుకుని ఆపై టాలీవుడ్ లో అగ్ర నటుడిగా సూపర్ స్టార్ గా ఎందరో అభిమానులతో పాటు, గొప్ప ప్రఖ్యాతలు కూడా గడించారు. ఒకానొక సమయంలో నటరత్న ఎన్టీఆర్ తో పోటా పోటీగా సినిమాలు చేసిన కృష్ణ, మధ్యలో ఆయన సినిమాలతో ఢీ కొట్టేవారు. అయితే అదంతా కేవలం సినిమాల వరకే అని, బయట మాత్రం అన్నగారు అంటే తనకు ప్రాణం అని కృష్ణ ఎప్పుడూ చెప్తుంటారు. 

 

ఇక కృష్ణ తన కెరీర్ లో మొత్తం ఇప్పటివరకు 350కి పైగా సినిమాల్లో నటించడం జరిగింది. తెలుగు రంగంలో అప్పట్లో ఎప్పటికప్పుడు వస్తున్న సరికొత్త టెక్నాలజీలు పరిచయం చేసిన కృష్ణ, ఒకానొక సమయంలో ఒకదానితో పాటు మరొకటి అవకాశాలతో పెద్దగా ఖాళీ లేకుండా పూర్తిగా షూటింగులతోనే గడిపేవారు. ఇక రాను రాను కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న నిర్మాతలు కృష్ణతో సినిమాలు చేయడానికి మొగ్గుచూపేవారట. అదే సమయంలో ఆయన ఒకేసారి ఆరు నుండి పది సినిమాల షూటింగ్స్ లో పాల్గొనేవారట. ఇక ఒక రోజులో ఉన్న మొత్తం 24 గంటల్లో ఏకంగా 22 గంటలు పని చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణ అంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. 

 

అంటే ఆయన సాధారణంగా పడుకుని ఉన్న సన్నివేశాలను సైతం, సినిమాల్లో అక్కడక్కడా అవసరం ఉండడంతో షూట్ చేసి సినిమాల కోసం వాడుకునే వారంటే, కృష్ణ హీరోగా ఎంతలా సినిమాలకే తన లైఫ్ ని అంకితం చేసారో అర్ధం చేసుకోవచ్చు. అది మాత్రమే కాక, ఎక్కువగా ఆయనకు ఇంటికి వెళ్ళడానికి కూడా తీరిక ఉండేది కాదట. అందుకే ఎప్పుడో ఒక్కసారి కొద్దిగా ఖాళి దొరికితే చాలు ఫ్యామిలితో ఊటీ వంటి విహార ప్రదేశాలకు వెళ్లి సేద తీరేవారట. ఆ విధంగా అన్ని గంటల పాటు పని చేయడం వల్లనే కృష్ణ ఆరోగ్యం కొద్దికాలంలోనే దెబ్బతిన్నదని, అయితే ఆయన చిన్నకుమారుడు మహేష్ సినిమారంగ ప్రవేశం తరువాత కృష్ణ పూర్తిగా సినిమాలు తగ్గించేశారని తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: