మెగాస్టార్ చిరంజీవితో సినిమా, టాలీవుడ్ లో ఉన్న ఏ దర్శకుడికి అయినా సరే ఇది ఒక కల. చాలా మంది యువ దర్శకులు ఆయనతో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన డేట్స్ కోసం ఆయన కోసం కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూసారు దర్శకులు. ఆయనకు తగిన విధంగా కథలు రాసుకుని ఒక్క అవకాశం ఇస్తే చాలు అనుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కనీసం కథ వింటే చాలు అనుకునే వాళ్ళు. 

 

ఇప్పుడు ఒక దర్శకుడికి నేరుగా చిరంజీవి నుంచి పిలుపు వచ్చింది. సినిమా చేద్దాం అంటూ ఆయన ఫోన్ చేసి మరీ అడిగారని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ దర్శకుడు ఎవరో కాదు... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసి స్టార్ దర్శకుడు అయిన హరీష్ శంకర్. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది దసరా లోపు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన లుసీఫార్ అనే సినిమా చేస్తారు. 

 

ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా అనే టాక్ వస్తుంది. ఈ నేపధ్యంలో 2020 చివరి నాటికి హరీష్ శంకర్ తో సినిమా కూడా చిరంజీవి అనుకున్నారట. దానికి కారణం ఏంటీ అంటే, ఇటీవల కొన్ని కథలను వినే సమయంలో హరీష్ శంకర్ కథ కూడా ఆయన విన్నారు. చిరంజీవి వయసుకి తగిన విధంగా ఆ కథ ఉంది. ఇన్నాళ్ళు మాస్ జోనర్ లో సినిమాలు ఎక్కువ చేసిన చిరంజీవి కి ఆ కథ అయితే సరిగా నప్పుతుందని, కొత్తగా కూడా ఉంటుందని భావిస్తున్నారట. అందుకే హరీష్ శంకర్ కి చిరంజీవి నేరుగా ఫోన్ చేసి పిలిచినట్టు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: