ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ చాలా వరకు పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేసిన నేపధ్యంలో ప్రభాస్ తో సినిమా కోసం చాలా మంది దర్శకులు పోటీ పడుతున్నారు. ఆయనతో సినిమాలు చేయడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆయనతో సినిమా చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటున్నారు. ఆయన పక్కన హీరోయిన్ నుంచి చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు ఎంపిక చాలా ఇబ్బందిగా మారుతుంది అనే టాక్ వినపడుతుంది. 

 

ఇప్పుడు ఆయన జాన్ అనే సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దీనితో ఈ సినిమా కోసం ప్రభాస్ ఎక్కువగానే కష్టపడుతున్నాడు. సాహో సినిమా ఫ్లాప్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఎలా అయినా సరే హిట్ కొట్టాలని, ఫాం లోకి రావాలని భావిస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ సినిమాలో ఆయన పక్కన విలన్ కోసం చాలా కష్టపడుతున్నారట దర్శకుడు. ప్రభాస్ కి బాహుబలి సినిమా తో ఆయన పక్కన ఆయన రేంజ్ లో ఉండే విలన్ అయితేనే బాగుంటుంది అనే అభిప్రాయానికి వచ్చారు దర్శకులు. 

 

కాబట్టి ఎవరిని పడితే వాళ్ళను ఎంపిక చేయకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాన్ సినిమాలో ఆయన పక్కన విలన్ గా ముందు జగపతి బాబుని ఎంపిక చెయ్యాలని భావించారు. కాని ప్రభాస్ కి ఆయన సరిపోతారా లేదా అనే ఆలోచనలో చిత్ర యూనిట్ పడింది. ఈ సమయంలోనే ఒక బాలీవుడ్ విలన్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కూడా కాకపోతే మళ్ళీ రానాను ఆయన పక్కన విలన్ ని చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో ఎక్కువగా వినపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: