సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సినిమాలు మొదలెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చేసింది ఇరవై ఆరు సినిమాలే.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడు మొదలుకుని, మొన్న సంక్రాంతి కానుకగా రిలీజైన సరిలేరు నీకెవ్వరు వరకు ఇరవై ఒక్క ఏళ్ళలో మహేష్ చేసింది ఇరవై ఆరు సినిమాలు మాత్రమే.. చేసింది తక్కువ సినిమాలే అయినా తెచ్చుకున్న పేరు మాత్రం చాలా ఉంది. బాలీవుడ్ లో ఒక్క సినిమా చేయకపోయినా అక్కద మహేష్ అంటే తెలియని వారుండరు..

 

 


తెలుగు సినిమా స్థాయి పెరగాలి అని ఆరాటపడే మహేష్ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంటాడు. చేసిన సినిమాల్లోనూ వైవిధ్యత కనిపించేలా జాగ్రత్త పడుతుంటాడు. ఎప్పుడూ కొత్తదనం కోసం తపించే మహేష్ కేరీర్లో ఎన్నీ వైవిధ్యమైన పాత్రల్లో కనిపించాడు. టక్కరి దొంగలో కౌబోయ్ గా, అర్జున్ సినిమాలో అక్క కోసం తపనబడే తమ్ముడిగా, వన్ నేనొక్కడినే సినిమాలో అమ్మా నాన్నల కోసం వెతికేవాడిగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులకి వినోదాన్ని పంచాడు.

 

 


ఎన్నో విభిన్న కథాంశాలు గల చిత్రాలు చేసిన మహేష్.. సినిమాలు చేయడంలో చాలా ఆలస్యం చేస్తాడు. ఈ విషయంలో వాళ్ల నాన్న క్రిష్ణగారితో పూర్తి వ్యతిరేకంగా ఉండేవాడు. ఒకానొక టైమ్ లో ఏడాదికి ఒక సినిమా కూడా విడుదల కాలేదు. ఖలేజా సమయంలో అయితే ఏకంగా మూడేళ్ళు గ్యాప్ తీసుకుని తెర మీద కనబడ్డాడు. ఈ విషయమై మహేష్ ని విలేకరులు మీ నాన్నగారు వరుసపెట్టి సినిమాలు చేసేవారు. కానీ మీరెందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు అని ప్రశ్నించారు.

 

 


దీనికి మహేష్ చాలా ఆసక్తికరంగా సమాధానం చెప్పాడు. అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు..ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు.. ఇప్పుడు కూడా మా నాన్నలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తే ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుంది అని చెప్పాడు. కానీ అలా చెప్పిన మహేష్ కొన్ని రోజుల తర్వాత మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వడం కరెక్ట్ కాదని భావించి, సంవత్సరానికి ఒక సినిమా విడుదల అయ్యేలా చూసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: