మహేష్ బాబు తన చిత్రాలన్నీ కొత్తగా ఉండేలా చూసుకుంటాడు. విభిన్నంగా ఉంటూ ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచాలని ఆశిస్తుంటాడు. ఇప్పటి వరకు మహేష్ చేసిన ప్రయోగం లేదనే చెప్పాలి. ఎన్నో కొత్త కాన్సెప్టులు చేస్తూ తెలుగు సినిమాని సరికొత్త దారిలో తీసుకెవెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. మహేష్ కి తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని తపన పడుతుంటాడు.

 

 

బాహుబలి సినిమా మన స్థాయికి పెంచడం మహేష్ కి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందట. మహేష్ కెరీర్లో ఇప్పటి వరకు ఏ సినిమాను రీమేక్ చేయలేదు. మహేష్ నటించిన చాలా సినిమాలు వేరే భాషల్లో రీమేక్ అయ్యాయి. కానీ మహేష్ ఒక్క సినిమాని కూడా తెలుగులో రీమేక్ చేయలేదు. మహేష్ నటించిన ఒక్కడు, అతడు, పోకిరి వంటి సినిమాలు వేరే భాషల్లో రీమేక్ అయ్యి మంచి విజయం సాధించాయి.

 

 

మహేష్ రీమేక్ ఎందుకు చేయడు అన్న విషయం వదిలేస్తే ఒకానొక టైమ్ లో మహేష్ ఒక సినిమాని రీమేక్ చేయాలని భావించాడట. ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పిలవబడుతున్న శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన త్రీ ఇడియట్ సినిమాని రీమేక్ చేయాలని అనుకున్నారు. రీమేక్ లో మహేష బాబుని హీరోగా తీసుకుందామని ప్రయత్నించారు. కానీ మహేష్ ఒప్పుకోకపోవడంతో స్నేహితుడు పేరుతో తమిళ నటుడు విజయ్ హీరోగా రీమేక్ చేశారు.

 

 

అయితే మహేష్ ఈ సినిమాని ఒప్పుకోకపోవడానికి ప్రధాన కారణం ఉందని అంటున్నారు. త్రీ ఇడియట్ సినిమాలో ఆమీర్ ఖాన్ తో పాటు మరో ఇద్దరు హీరోలు కూడా ఉంటారు. రీమేక్ చేసేటపుడు హీరోగా మహేష్ బాబు నటిస్తే, మిగతా ఇద్దరి స్థానాల్లో తెలుగు హీరోలని తీసుకోమని సజెస్ట్ చేశాడట మహేష్. కానీ శంకర్ తమిళ నటులని తీసుకుందామని పట్టుబట్టడంతో మహేష్రీమేక్ చేయలేదని వాదన.  

మరింత సమాచారం తెలుసుకోండి: