ప్రస్తుతం పవన్ వరసపెట్టి సినిమాలు చేస్తున్నా అతడు ఎంచుకుంటున్న కథలు అదేవిధంగా అతడి దర్శకుల ఎంపిక పవన్ వీరాభిమానులకు కూడ ఏమాత్రం నచ్చడం లేదు. దీనితో ఈ మధ్య పవన్ హరీష్ శంకర్ ల కాంబినేషన్ మూవీ మరొకసారి రిపీట్ కాబోతోంది అని వచ్చిన వార్తలు చూసి పవన్ అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోవడమే కాకుండా మరొకసారి ‘గబ్బర్ సింగ్’ ప్రయోగం రిపీట్ కాబోతోంది అంటూ కలలు కంటున్నారు. 


ఈ నేపధ్యంలో ఈమధ్య హరీష్ శంకర్ పవన్ ను కలిసి కొన్ని కథలు చెప్పినా అతడు స్పందించ లేదు అంటూ వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి త్వరలో నటించబోయే మళయాళ మూవీ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ ను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తాడు అని వస్తున్న వార్తలు విని పవన్ వీరాభిమానులు నిరాశ పడుతున్నట్లు టాక్.


వాస్తవానికి చిరంజీవి ప్రస్తుతం కొరటాల మూవీ ప్రాజెక్ట్ చేస్తున్నా ఆ మూవీ పూర్తి అయిన తరువాత వెంటనే ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ప్రారంభించాలని ఆలోచనలు చేస్తున్నాడు. అయితే ఈ మూవీకి స్క్రిప్ట్ అందించిన సుకుమార్ ప్రస్తుతం బన్నీ మూవీలో చిక్కుకోవడంతో మెగా కాంపౌండ్ నిర్మించే ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ను హరీష్ శంకర్ చేత దర్శకత్వం వహింప చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు ప్రస్తుతం చిరంజీవికి ఉన్నట్లు తెలుస్తోంది.


దీనికితోడు తాను నటించే సినిమాల విషయంలో క్షణానికి ఒక విధంగా మారిపోతున్న పవన్ ను నమ్ముకుని కూర్చునే కంటే చిరంజీవి ఆఫర్ ను అందిపుచ్చుకుని చిరంజీవితో మూవీ చేయడమే మంచిది అన్న ఉద్దేశ్యం హరీష్ శంకర్ కు కూడ ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో హరీష్ శంకర్ పవన్ కు అన్యాయం చేసి చిరంజీవి వైపు వెళ్ళిపోతున్నాడు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. అయితే పవన్ వీరాభిమాని మాత్రమే కాకుండా పవన్ భక్తుడు గా తనకు తాను పిలిపించుకునే హరీష్ శంకర్ ఇలా పవన్ ను మధ్యలో వదిలేస్తాడా అన్నదే ప్రశ్న..

 

మరింత సమాచారం తెలుసుకోండి: