తెలుగు చలన చిత్ర రంగంలో ఎంతో మంది హీరోలు అంచలంచెలుగా పైకి వచ్చారు.  తమకు హీరోగా గుర్తింపు రావడానికి ఎన్నో చిత్రల్లో నటించాల్సిన పరిస్థితి ఉండేది.  కానీ కొంత మంది హీరోలకు మాత్రం అదృష్టం భలే కలిసి వస్తుంది.  గతంలో ఉదయ్ కిరణ్ ‘చిత్రం’ తర్వాత మనసంతా నువ్వే చిత్రంతో ఘన విజయం అందుకొని ఒక్కసారే టాప్ హీరోగా ఎదిగాడు.  కానీ అదే రీతిలో డౌన్ అయ్యాడు. మంచి కంటెంట్ తో వచ్చే చిత్రాలతో కొంత మంది హీరోలుకు ఇండస్ట్రీలో తక్కువ సమయంలో ఎక్కువ పేరు వస్తుంది.  ఒకవేళ వరుస సక్సెస్ సాధిస్తే ఓకే.. కర్మకాలి వరుస డిజాస్టర్స్ అయితే మాత్రం కష్టాలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. 

 

తాజాగా ఇలాంటి పరిస్థితి ఇప్పుడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు ఎదురవుతున్నట్లు తెలుస్తుంది. పెళ్లిచూపులు చిత్రం తర్వాత ఈ హీరో యాటిట్యూడ్ కు తగ్గట్లుగానే యువతకు నచ్చే అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీ వాలా లాంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు.  ఎంత వేగంగా విజయాలు అందుకున్నాడు.. అంతే వేగంగా ఫ్లాపులు కూడా అందుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. నోటా, డీయర్ కామ్రెడ్ తో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ హీరో ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ కూాడా విమర్శల పాలైంది. ఫిలిం క్రిటిక్స్ కూడా ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలే ఇచ్చారు.  తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా 5.5 కోట్ల షేర్ రాబట్టింది. 

 

గతంలో ఈ హీరో నటించిన చిత్రాలతో పోలిస్తే ఇది చాలా దారుణం అని అంటున్నారు. ఇక మూవీపై బ్యాడ్ టాక్ రావడంతో.. రెండో రోజు భారీ ఎఫెక్ట్ పడింది.   ఈ చిత్రం 2.4 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తం రెండు రోజుల్లో  ఈ చిత్రం 8 కోట్ల షేర్ రాబట్టింది.  ఈ చిత్రానికి జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ 30 కోట్ల వరకు ఉంది. గతంలో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీ వాలా దాదాపు నెల రోజులు ఫుల్ కలెక్షన్లతో దుమ్మురేపాయి.  ఇక ముందు విజయ్ దేవరకొండ కథ విషయలో కేర్ తీసుకోకపోతే మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అనకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: