దేశంలోనే కాకుండా ప్రపంచంలోని మంచి సినిమాలను, కాన్సెప్టులను తీసుకుని ఆయా భాషల్లో రీమేక్ చేయడం చాలా సాధారణ విషయం. ఇందుకు చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకూ, అప్ కమింగ్ డైరక్టర్ నుంచి సీనియర్ డైరక్టర్స్ వరకూ ఎవరూ మినహాయింపు కాదు. కానీ తెలుగులో సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న మహేశ్ బాబు మాత్రం హీరో అయ్యాక తన 21ఏళ్ల లాంగ్ కెరీర్ లో ఇప్పటివరకూ రీమేక్ సబ్జెక్ట్ ను టచ్ చేయలేదు. అలా టాలీవుడ్ లో రీమేక్ లు ముట్టుకోని ఇద్దరు ముగ్గురు హీరోల్లో మహేశ్ కూడా ఉన్నాడు.

 

 

ఫ్లాపులెదురైనా, పరభాషలో మంచి సబ్జెక్టులు వచ్చినా ఎప్పుడూ మహేశ్ అటువైపు చూడలేదు. మహేశ్ కు సరిపోతాయని భావించి పలువురు దర్శకులు, నిర్మాతలు మహేశ్ వద్దకు పలు సబ్జెక్టులు తీసుకెళ్లినా ఆయన సున్నితంగా తిరస్కరించాడు. సాధారణంగా తెలుగులో వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలు సేఫ్ జోన్ లోకి ఎంటర్ అవటానికి రీమేక్ సబ్జెక్టులు ఎంచుకుంటారు. కానీ మహేశ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు గ్యాప్ తీసుకుని ఆలోచించి స్ట్రైట్ సినిమాలే చేశాడు. దీనికి మహేశ్ తనదైన వివరణ ఇస్తూంటాడు. ఏదైనా సినిమా చేసేపటప్పుడు కొత్తగా చేస్తున్నామని భావించాలి. అప్పటికే ఒకరు చేసిన సబ్జెక్ట్ చేస్తే మనల్ని కొత్తగా ఆవిష్కరించుకోవటానికి ఏమీ ఉండరు. పోలిక తప్ప. సెట్లో అప్పుడు చేసే సీన్ కొత్తగా ఉండాలనేది నా ఫిలాసఫీఅంటూ ఉంటాడు.

 

 

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి పద్దతిని మరో ఇద్దరు హీరోలు కూడా పాటిస్తున్నారు. ఈ విషయంలో మహేశ్ కు తెలుగు సినిమాలపై ఉండే అభిమానం అనే చెప్పాలి. ఆమధ్య 3ఇడియట్స్ మహేశ్ తో చేయాలని స్టార్ డైరక్టర్ శంకర్ ట్రై చేశాడు. కానీ మహేశ్ తన మాట మీదే ఉండి ఆ సినిమా చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: