అతనో తెలుగు యువ హీరో.. చేసిన నాలుగైదు సినిమాలకే స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. యూత్ ఆడియెన్స్ ను బుట్టలో వేసుకున్న అతగాడు ఏ సినిమా చేసినా సరే విపరీతైమైన బజ్ ఏర్పడుతుంది. రిలీజ్ ముందు బజ్ బాగున్నా ఆఫ్టర్ రిలీజ్ సీన్ మారిపోతుంది. అతను చేసిన రీసెంట్ టూ మూవీస్ బాల్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. అసలు ఇలా అవడానికి ప్రధాన్న కారణం దర్శకులు కాదట ఆ హీరోనే అంటున్నారు. కథ ఓకే చేసినప్పటి నుండి గుమ్మడికాయ కొట్టేవరకు.. ఆఖరికి ఎడిటింగ్ టైం లో కూడా హీరో గారి ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ ఉందని తెలుస్తుంది.

 

స్క్రీన్ ప్లే కూడా ఇతను చెప్పినట్టుగా చేయాలని అంటున్నాడట. అంతేకాదు సినిమాకు మరో దర్శకుడిగా తనకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడట. డైరక్టర్ చెప్పేది ఒకటైతే దాని ఇతను మరోలా చేస్తాడట. ఇలా తనకు నచ్చినట్టుగా చేయడం వల్ల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అతని క్రేజ్ చూసి అతనితో సినిమా చేస్తున్న దర్శకులు సైతం అతని మాటకి ఎదురుచెప్పలేకపోతున్నారట. రెండు సినిమాల ముందు వరకు ఓ రేంజ్ లో ఉన్న ఈ హీరో పరిస్థితి ఇప్పుడు కొద్దిగా గ్రాఫ్ డౌన్ అయ్యిందని అనిపిస్తుంది.

 

హీరో ఎప్పుడైతే దర్శకుడు చేసే పనిలో వేలు పెడతాడో అప్పుడో సినిమా ట్రాక్ తప్పేస్తుంది. అయితే చాలా తక్కువ సార్లు హీరో చెప్పిన మార్పులు సినిమాకు హెల్ప్ అవుతాయి. మరి ఈ హీరో ఇక మీద అయినా తన పంథా మార్చుకుని డైరక్టర్ చెప్పినట్టుగా చేస్తాడేమో చూడాలి. మరో రెండు ఇలాంటి ఫ్లాపులే పడితే మాత్రం హీరో గారి పని కష్టమవుతుంది. మరి ఫ్లాపుల వల్ల హీరో గారిలో మార్పు వచ్చి కేవలం తానొక హీరోని మాత్రమే అనే విషయాన్ని గుర్తుచేసుకుని డైరక్టర్ కు ఇవ్వాల్సిన స్పేస్ ఇస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: