ఒక్కోసారి హీరోలు వద్దునుకున్న సినిమాలు వారికీ ఊపిరి ఇస్తాయి..అలాగే నిరాశ ను గురి చేస్తాయి. ఒక హీరో వదులుకున్న సినిమా మరో హీరో చేసి హిట్టు కొట్టడం లేదా... ఒక హీరో వదులుకున్నా సినిమా మరో హీరో చేసి డిజాస్ట‌ర్ కొట్టడం సహజంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఒకరి అదృష్టాన్ని... వేరొకరి దురదృష్టాన్ని ఎవరు ఆపలేరు. ఈ ప్రక్రియ అలా జరిగిపోతూ ఉంటుంది. గతంలో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వదులుకున్న‌ ఎన్నో సినిమాలు మాస్ మహారాజ్ రవితేజ చేసి అప్పట్లో సూపర్ హీరోగా మారిపోయాడు.



తాజాగా హీరో నానిసినిమా వద్దనుకుని సేఫ్ అయ్యాడని అంటున్నారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఇదే పెద్ద హాట్ టాపిక్. నాని ఆ సినిమాను వ‌దులు కోవ‌డంతో మ‌నోడి కెరీర్‌లో పెద్ద డిజాస్ట‌ర్ ఒక‌టి త‌ప్పించుకున్న‌ట్ల‌య్యింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనే వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.



విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజ్ నేప‌థ్యంలో ఈ సినిమాను ఏకంగా రు.30.5 కోట్ల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా అమ్మారు. అయితే ఈ క‌థ‌ను ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్ ముందుగా నేచురల్ స్టార్ నానికి క్రాంతి మాధవ్ వినిపించారట. ప్రథమార్థం విన్న తర్వాత అటుపై ఇంకా వినేందుకు ఏమాత్రం ఒప్పుకోలేదుట. ఈ క‌థ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని నాని ఎస్కేప్ అయ్యాడ‌ట‌.



అయితే క్రాంతి మాధ‌వ్ త‌ర్వాత ఇదే క‌థ‌ను విజ‌య్‌కు చెప్పి ఒప్పించుకున్నారు. ఏదేమైనా క్రాంతి మాధవ్ చివరిగా విజయ్ దేరకొండని బుట్టలో వేశారన్న గుసగుసా వినిపిస్తోంది. అల నాని సేఫ్ అయితే.విజయ్ చేసి ఈ సినిమా చేసి త‌న కెరీర్‌లో వ‌రుస‌గా మూడో ప్లాప్ వేసుకున్నాడు. విజ‌య్ వేసిన రాంగ్ స్టెప్ అత‌డిని ముంచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: