కొంత మంది విషయంలో వయసు అనేది కేవలం ఓ నంబర్ మాత్రమే. హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ విషయంలో అదే నిజం అనిపిస్తోంది. 50 ఏళ్ల వయసులోనూ ఈ భామ అదిరిపోయే అందాలతో కుర్ర గుండెల్లో సెగలు రేపుతోంది. మెంటల్‌గానే ఫిజికల్ గానూ ఈ భామ అందం ప్రతీ ఏడాది పెరుగుతూ వస్తుందంటున్నారు ఫ్యాన్స్. మరో హాట్ బ్యూటీ షకీరాతో కలిసి 2020 సూపర్ బౌల్ హాఫ్ టైం షో పూర్తి చేసిన జెన్నిఫర్ ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ.
తాజాగా ఈ భామ తన ఒంపులు చూపిస్తూ ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏ మాత్రం వన్నె తరగని అందాలను ఆరబోస్తూ బికినీతో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆదివారం జెన్నిఫర్ పోస్ట్ చేసిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది. ఫోటోతో పాటు ఆమె రిలాక్స్డ్ అండ్ రీ చార్జ్డ్ అంటూ కామెంట్ చేసింది. గత వారం వాలెంటైన్స్ డే సందర్భంగానూ సోషల్ మీడియాలో సందడి చేసింది జెన్నిఫర్.
తన బాయ్ ఫ్రెండ్ అలెక్స్ రోడ్రిగ్జ్కి ముద్దు పెడుతూ ఓ వీడియోనే షేర్ చేసింది. ఆ వీడియోతో పాటు `ప్రేమకు ప్రేమతో.. అదే ఆనందం. నువ్వు నా మనసును పరిపూర్ణం చేశావు.. ఐ లవ్ యూ` అంటూ కామెవటం చేసింది. గత ఏడాది హస్టలర్స్ సినిమాలో నటించిన జెన్నిఫర్ త్వరలో ఓ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న మ్యార మీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో ఓవిన్ విల్సన్, మాలుమాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కాట్ కొయ్రో దర్శకుడు. మ్యారీ మీ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు చిత్రయూనిట్.