టాలీవుడ్ లో ఆ హీరోకి వయసు పెరుగుతుంది కానీ అందం  మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. బాల నటుడిగానే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మహేష్ బాబు తండ్రితో  కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు అభిమానుల నేటితరం సూపర్ స్టార్ గా మారిపోయారు మహేష్ బాబు. ఇప్పటికే ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి  మహేష్ బాబు సినిమాలు. పోకిరి సినిమాతో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించిన మహేష్ బాబు  దూకుడుతో ఆ ట్రెండ్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగించాడు... ఇక కథల ఎంపికలో కూడా ఆచితూచి అడుగులు వేస్తూ.. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నారు మహేష్ బాబు. తనదైన అందంతో అమ్మాయిల కలల రాకుమారుడిగా... అభిమానుల సూపర్ స్టార్ గా  ప్రస్తుతం వరుస సినిమాలతో అలరించనున్నాడు. 

 


 ఇక ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మహేష్ బాబు.  అయితే మహేష్ బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు సరే కానీ.. సిక్స్ ప్యాక్ మాత్రం ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించింది లేదు. ఓవైపు బాలీవుడ్ మరోవైపు టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. ఎక్కువగా సిక్స్ పాక్ పైన దృష్టి పెడుతున్నారు అందరు హీరోలు. అయితే మహేష్ బాబు ఫిట్ గా  ఉంటాడు కానీ సిక్స్ ప్యాక్ లో మాత్రం ఇప్పటివరకు కనిపించలేదు. దీంతో అభిమానులు కూడా సిక్స్ ప్యాక్  కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానులందరికీ తెలియని ఓ ఆసక్తికర విషయం ఏమిటంటే... మహేష్ బాబు ఇది వరకే సిక్స్ ప్యాక్ ట్రై చేశారట. కానీ మధ్యలో సిక్స్ ప్యాక్ ని ఆపేసినట్లు మహేష్ బాబు వెల్లడించారు. 

 


 మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వన్ నేనొక్కడినే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎంతో ఫిట్ గా కనిపించిన మహేష్ బాబు సిక్స్ ప్యాక్ తో అందరిని ఆశ్చర్యపరుస్తాడు  అని అనుకున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం తన బాడీ ఫిట్ నెస్ ని చూపించారు కానీ సిక్స్ ప్యాక్ మాత్రం చూపించలేదు. అయితే ఈ సినిమా సమయంలో సిక్స్ ప్యాక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మహేష్ బాబు. తాను సిక్స్ ప్యాక్ ట్రై చేద్దామని వర్కౌట్స్ కూడా ప్రారంభించానని... కానీ సిక్స్ ప్యాక్ వల్ల ఫేస్ లో ఏదో తేడా వస్తుందని గమనించి సిక్స్ ప్యాక్ ట్రై చేయడం ఆపేశాను అంటూ మహేష్ బాబు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: